ఖమ్మంమయూరిసెంటర్: గణేష్ నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. అధికారులను ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని ధంసలాపురం చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ సునీల్‌దత్, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి కలెక్టర్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా సౌకర్యాల కల్పన, ట్రాఫిక్ నియంత్రణ, రూట్ల ఖరారుపై సూచనలు చేశారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, బారికేడ్లు, క్రేన్లు, బోట్లు ఏర్పాటుచేసి గజ ఈతగాళ్లను నియమించాలని సూచించారు. భక్తులకు తాగునీరు సమకూర్చి, మెడికల్ క్యాంపులు ఏర్పాటుచేయాలని, పారిశుద్ధ్య కార్మికులను నియమించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్య శాఖ అధికారి మల్లేశం, ఆర్‌డీఓ శ్రీనివాస్, తహసీల్దార్ జయచందర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ధంసలాపురం చెరువును పరిశీలించిన
కలెక్టర్, సీపీ


