కల్లూరురూరల్: ఉద్యోగ, ఉపాధ్యాయులకు పీఆర్‌సీ అమలుచేస్తామని ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నెరవేర్చాలని పీఆర్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.రంగారావు కోరారు. కల్లూరులో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు కావొస్తున్నా ఉద్యోగులకు ఇచ్చిన ఏ హామీ అమలుచేయాలని ఆరోపించారు. పీఆర్‌సీ అమలు, డీఏలు, బకాయిల చెల్లింపుతో పాటు సీపీఎస్ రద్దుపై నిర్ణయం తీసుకోక ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో నిరాశ అలుముకుందని తెలిపారు. ఈమేరకు రాష్ట్ర స్థాయిలో చేసిన ఉద్యమానికి తలొగ్గి త్వరలో పరిష్కరిస్తామని సీఎం స్వయంగా హామీ ఇచ్చినాకార్యాచరణ రూపొందించలేదన్నారు. ఈ సమావేశంలో పీఆర్‌టీయూ జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు ఆర్.బ్రహ్మారెడ్డి, నాయకులు పాకాల రమేష్, వెంకటేశ్వర్లు, సురేష్‌బాబు, చెన్నకేశవరెడ్డి, ఎం.డీ.మౌలాలి, షేక్ చాంద్‌సాహెబ్, టి.సత్యనారాయణరెడ్డి, వీరవల్లి శ్రీనివాసరావు, బోబోలి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
పీఆర్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి
రంగారావు


