రాపల్లె మేజర్‌కు గండి కొట్టిన రైతులు | - | Sakshi
Sakshi News home page

రాపల్లె మేజర్‌కు గండి కొట్టిన రైతులు

Sep 20 2026 12:21 AM | Updated on Sep 20 2026 12:21 AM

కొణిజర్ల: రైతుల కష్టాలు తీర్చాలని సాగర్‌లో నీరు లేకున్నా తాగు అవసరాల కోసం విడుదల చేసిన నీటితో చెరువులు నింపేలా అధికారులు నిర్ణయించా రు. అయితే, కొందరు సాగర్‌ కాల్వకు గండి కొట్టడంతో నీరంతా వృథాగా పోతోంది. కొణిజర్ల మండలం పెద్దగోపతి సమీపాన రాపల్లె మేజర్‌ ద్వారా నీటిని విడుదల చేస్తున్న అధికారులు సమీపంలోని చెరువులు నింపుతున్నారు. ఈక్రమాన శుక్రవారం అర్ధరాత్రి చింతకాని మండలం నాగిలిగొండకు చెందిన కొందరు జేసీబీ సాయంతో పెద్ద గోపతి ఊరకుంట సమీపాన కాల్వకు గండి కొట్టినట్లు తెలిసింది. దీంతో చెరువు పూర్తి స్థాయిలో నిండి అలుగు పారి నీరంతా వృథాగా పొలాల్లోకి చేరుతోంది. అంతేకాక చెరువులో పోసిన చేపలు కొట్టుకుపోయి రూ.5లక్షల నష్టం వాటిల్లిందని మత్స్యకారులు వాపోయారు. నీరంతా వృథాగా గ్రామంలో నుంచి రోడ్డపై పారుతున్నందున అధికారులు తక్షణమే స్పందించి కాల్వ గండి పూడ్చి వేయించాలని రైతులు కోరుతున్నారు.

వృథాగా పోతున్న సాగర్‌ జలాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement