ఖిలా వరంగల్: క్రీడల్లో రాణించిన విద్యార్థులకు మంచి భవిష్యత్ ఉంటుందని కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి.రామచంద్రం తెలిపారు. వరంగల్ బొల్లికుంటలోని వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాల క్రీడామైదానంలో నిర్వహిస్తున్న కేయూ యూనివర్సిటీ అండ్ కాలేజ్ మహిళా క్రీడోత్సవాలను శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల నుంచి 780 మంది మహిళా క్రీడాకారులు హాజరుకాగా ఈనెల 21 తేదీ వరకు కబడ్డీ, సాఫ్ట్‌బాల్, బాస్కెట్‌బాల్, బాల్ బ్యాడ్మింటన్, క్రాస్ కంట్రీ అంశాల్లో పోటీలు జరుగుతాయని తెలిపారు. కేయూ స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ ప్రొఫెసర్ టి.శాస్త్రి, వాగ్దేవి కళాశాల డైరెక్టర్ వాణిదేవితో పాటు హెచ్.సుదర్శన్‌రెడ్డి, ఫ్రొఫెసర్ సునీల్‌రెడ్డి, రవీందర్, ఫిజికల్ డైరెక్టర్లు పాల్గొన్నారు.
కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం


