బోనకల్: గ్రామీణ ప్రాంతాల నిరుద్యోగ యువత పోలీస్, ఆర్మీ, పారామిలటరీ ఉద్యోగాలు సాధించేలా బోనకల్‌లో ఉచిత శిక్షణ ఇస్తున్నారు. గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యాన ఎస్‌బీఐ ఫౌండేషన్ సహకారంతో శిక్షణ ఇస్తుండగా, పల్లె ప్రకృతి వనంలో శారీరక శిక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు సర్పంచ్ బానోత జ్యోతి తెలిపారు. ఈ సందర్భంగా శనివారం ఆమె శిక్షణను పరిశీలించి వివరాలు వెల్లడించారు. గతంలోనూ ఎస్‌బీఐ ఫౌండేషన్ ఆధ్వర్యాన పది కంప్యూటర్లు సమకూర్చారని తెలిపారు. ఉపసర్పంచ్ బానోతు కొండ, భవిష్య ప్రాజెక్ట్ మేనేజర్ జి.శ్రీనివాస్, ఫీల్డ్ కోఆర్డినేటర్లు కె.వెంకటేశ్వరావు, జి.గోపి, కోచ్‌లు ఎం.డీ.అసద్, ఎం.కృష్ణమోహన్ పాల్గొన్నారు.


