హైకోర్టు సీనియర్‌ న్యాయవాదిగా విష్ణువర్ధన్‌ | - | Sakshi
Sakshi News home page

హైకోర్టు సీనియర్‌ న్యాయవాదిగా విష్ణువర్ధన్‌

Sep 20 2026 12:21 AM | Updated on Sep 20 2026 12:21 AM

భద్రాచలం: బూర్గంపాడు మండలం నాగి నేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామానికి చెందిన పత్తి విష్ణువర్ధన్‌ రెడ్డి హైకోర్టు డిజిగ్నేటెడ్‌ సీనియర్‌ న్యాయవాది గా నియమితుల య్యారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు ఈ హోదా పొందిన రెండో వ్యక్తి ఆయనే. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ హైకోర్టుకు అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌గా, జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) తరఫున స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాపిక్యూటర్‌గా వ్యవహరించారు. బార్‌ కౌన్సిల్‌ అఫ్‌ ఇండియా మెంబర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ న్యాయవా దుల సమస్యలు, హక్కులు, సంక్షేమంలో చురుకై న పాత్ర పోషించారు.

రాష్ట్రస్థాయి టీ.టీ. టోర్నీలో ప్రతిభ

ఖమ్మం స్పోర్ట్స్‌: అండర్‌ – 17, 18, 19 విభాగాల్లో ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి టేబుల్‌ టెన్నిస్‌ టోర్నీలో జిల్లా బాలబాలికలు ప్రతిభ చాటారు. పోటీల్లో ఖమ్మం చెందిన రోష్మిత, హేయాన్‌, రోహిణికా తన్వి, ఇమ్మానుయేల్‌, యశస్విని, ఠాగూర్‌ ట్రోఫీలు దక్కించుకున్నారు. క్రీడాకారులను డీవైఎస్‌ఓ సునీల్‌రెడ్డి, టేబుల్‌ టెన్నిస్‌ కోచ్‌ వీవీఎస్‌.మూర్తి, అసోసియేషన్‌ ప్రతినిధులు చలపతి, ఎస్‌.కే.ముజాహర్‌, రంజిత్‌, సంతోష్‌ పాపారావు, మణికాంత్‌ అభినందించారు.

తిరుమలకు పాదయాత్ర

పెనుబల్లి: భద్రాచలం నుంచి తిరుమలకు పాదయాత్ర చేస్తున్న భక్తులు శనివారం పెనుబల్లి మండలం వీఎం బంజర్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏటా తాము పాదయాత్రగా తిరుమల వెళ్తున్నామని తెలిపారు. బృందానికి నాయకులు పంది వెంకటేశ్వరావు, నల్లమోతు వినీల, ఈ.వీ.రమేష్‌, సంధ్యారాణి స్వాగతం పలికారు.

గిరిజన యువతకు 75 శాతం రిజర్వేషన్‌ కల్పించాలి

సీఎం రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్యేల వినతి

వైరా/ములకలపల్లి: గిరిజన ప్రాంతాల్లోని యువతీ యువకులు పోలీసు ఉద్యోగ నియామకాల్లో 75 శాతం రిజర్వేషన్లు కలిపించాలని వైరా, అశ్వారావుపేట, పినపాక ఎమ్మెల్యేలు మాలోత్‌ రాందాస్‌నాయక్‌, జారె ఆదినారాయణ, పాయం వెంకటేశ్వర్లు కోరారు. ఈ సందర్భంగా వారు శనివారం హైదరాబాద్‌లో ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌తో కలిసి సీఎం రేవంత్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. గిరిజన యువతకు భరోసా కల్పించేలా రిజర్వేషన్లు పెంచాలని, భౌగోళిక, సామాజిక ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. అలాగే, ములకలపల్లిలో బాలికల ఆశ్రమ పాఠశాల ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మంత్రి లక్ష్మణ్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు.

గణేష్‌ నిమజ్జనంలో ఎమ్మెల్యే

వైరా: వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని శనివారం నిమజ్జనానికి తరలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాందాస్‌నాయక్‌ ప్రత్యేక పూజలు నిర్వహించి నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. అంతకుముందు ‘ఏక్‌ పేడ్‌.. మాకే నామ్‌’ కార్యక్రమంలో భాగంగా వైరా జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే రాందాస్‌నాయక్‌ మొక్క నాటా రు. మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ డాక్టర్‌ కాపా చంద్రకళ, కమిషనర్‌ రామచంద్రయ్య, నాయకులు బొర్రా రాజశేఖర్‌, కట్ల రంగారావు, సూతకాని జైపాల్‌, డాక్టర్‌ కాపా మురళీకృష్ణ పాల్గొన్నారు.

పాతర్లపాడులో డీజే సీజ్‌

చింతకాని: నిబంధనలకు విరుద్ధంగా మండలంలోని పాతర్లపాడులో వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన డీజే సౌండ్‌ సిస్టంను పోలీసులు శనివారం సీజ్‌ చేశారు. డీజేను సీజ్‌ చేయడమే కాక సిస్టం యజమాని, వాహన యజమానిపై కేసు నమో దు చేసినట్లు ఎస్సై నరేష్‌ తెలిపారు. మండల వ్యాప్తంగా డీజే సిస్టంపై నిషేధం ఉన్నందున, నిబంధనలు పాటించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement