పురుగు మందు డబ్బాలతో మహిళల నిరసన | - | Sakshi
Sakshi News home page

పురుగు మందు డబ్బాలతో మహిళల నిరసన

Sep 20 2026 12:21 AM | Updated on Sep 20 2026 12:21 AM

చింతకాని: చింతకాని గ్రామానికి చెందిన పలువురు దళిత మహిళలు శనివారం పురుగుల మందు డబ్బాలతో నిరసన తెలిపారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో దళితులకు ఇచ్చిన మూడెకరాల భూముల వద్దకు నిరసన తెలిపి మాట్లాడారు. గత ప్రభుత్వంలో హయాంలో దళితులకు మూడెకరాల భూమి పంపిణీ చేయగా, చింతకానిలో 24 ఎకరాలకు సంబంధించి కొందరికి అన్యాయం జరిగిందని తెలిపారు. ఈ విషయమై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్తే సమస్య పరిష్కరించమని ఉన్నతాధికారులను ఆదేశించినా నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలిపారు. ఇకనైనా స్పందించకపోతే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని వెల్లడించారు.

17మందిపై కేసు నమోదు

చింతకానికి చెందిన 17 మంది ఎస్సీ మహిళలపై కేసు నమోదైంది. బీఆర్‌ఎస్‌ హయాంలో ఇచ్చిన భూమిలో నారపోగు వెంకట్రావమ్మ వరి నాట్లు వేయగా.. గ్రామానికి చెందిన మహిళలు ధ్వంసం చేశారు. అడ్డొస్తే పురుగుల మందు తాగుతామని బెదిరించారని, పొలాన్ని ధ్వంసం చేయడంతో రూ.95 వేలు నష్టం వాటిల్లిందని వెంకట్రావమ్మ ఫిర్యాదు చేసింది. దీంతో 17 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేష్‌ తెలిపారు.

అధికార లాంఛనాలతో ఆర్‌ఐ అంత్యక్రియలు

కారేపల్లి: నిజామాబాద్‌లో ఏఆర్‌ రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న హనుమకొండ సతీష్‌ తుపాకీ మిస్‌ఫైర్‌ కావడంతో శుక్రవారం మృతి చెందిన విషయం విదితమే. ఈమేరకు ఆయన మృతదేహాన్ని స్వస్థలమైన కారేపల్లి మండలం శాంతినగర్‌కు శుక్రవారం రాత్రి తీసుకొచ్చారు. కాగా, శనివారం ఉదయం ఏఆర్‌ ఏసీపీ బి.కృష్ణ, ఆర్‌ఐ డి.హరికుమార్‌ ఆధ్వార్యన ఆయన కుటుంబానికి తక్షణ సాయంగా రూ.30వేలు అందజేశారు. అనంతరం అధికార లాంఛనాలతో సతీష్‌ అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ కృష్ణ మాట్లాడుతూ విధి నిర్వహణలో సతీష్‌ సేవలు మర్చిపోలేనివని, ఆయన అకాల మృతి కుటుంబానికే కాక పోలీసు శాఖకు తీరని లోటని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐలు హనుమకొండ వెంకటేశ్వర్లు, తాటిపాముల సురేష్‌, పోలీసు ఉద్యోగులు, నాయకులు పెద్దబోయిన ఉమాశంకర్‌, అడపా పుల్లారావు, హనుమకొండ రమేష్‌, గుడిపూడి తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement