సత్తుపల్లి: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ శుక్రవారం కలిశారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఇన్‌స్పైర్, ఇగ్నైట్ శిక్షణ అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్ల ఇప్పించాలని కోరారు. ఈమేరకు వ్యక్తిత్వ వికాసం, ప్రేరణాత్మక శిక్షణ అందించేందుకు ఇన్‌స్పైర్, ఇగ్నైట్ బందాన్ని సీఎంకు పరి చయం చేశారు. ఈ కార్యక్రమంలో అశ్వరావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ కూడా పాల్గొన్నారు.
సత్తుపల్లి బ్లాక్–3ను సింగరేణి కేటాయించండి
సత్తుపల్లి ఓసీ బ్లాక్–3 బొగ్గు గనిని సింగరేణికు కేటాయించాలని ఎమ్మెల్యే రాగమయి కోరారు. ఈవిషయమై శుక్రవారం అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ బ్లాక్–3 దక్కించుకున్న అవంతిక ప్రైవేట్ కంపెనీ ఇప్పటివరకు పనులు చేపట్టనందున రద్దు చేసి సింగరేణికి కేటాయించాలని, తద్వారా స్థానికులు ఉద్యోగ అవకాశాలతో పాటు ప్రభుత్వానికి ఆదాయం లభిస్తుందని తెలిపారు. అలాగే, జీఎం కార్యాలయం నిర్వహణ, 33/11 కేవీ విద్యుత్ లైన్ల మార్పుపై ఆమె మాట్లాడారు.


