కల్లూరు రూరల్: మండలంలోని బత్తులపల్లికి చెందిన బొల్లిపోగు గురువయ్య(44) వారం క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. ఆయన ద్విచక్ర వాహనంపై కల్లూరు నుంచి బత్తులపల్లి వైపు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ఆటో ఢీకొట్టింది. ఘటనలో తీవ్రంగా గాయపడిన గురువయ్యను ఖమ్మంలో చికిత్స అనంతరం హైదరాబాద్ తరలించగా పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఆయనకు భార్య ప్రమీల, ఇద్దరు పిల్లలు ఉండగా, కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై హరిత తెలిపారు.


