ఈనెల 21న జాబ్‌మేళా | - | Sakshi
Sakshi News home page

ఈనెల 21న జాబ్‌మేళా

Sep 19 2026 12:22 AM | Updated on Sep 19 2026 12:22 AM

ఖమ్మంమయూరిసెంటర్‌: గ్రామీణ ప్రాంత యువతీ యువకులకు ఐసీఐసీఐ బ్యాంక్‌లో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఎన్‌ఐఐటీ(నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ) ఆధ్వర్యానఈనెల 21న జాబ్‌మేళా నిర్వహించనున్నారు. ఖమ్మంలోని టీటీడీసీ భవనంలో ఉదయం 10–30గంటలకు జాబ్‌మేళా మొదలవుతుందని డీఆర్‌డీఓ కె.శ్రీరామ్‌ తెలిపారు. ఆన్‌లైన్‌ పరీక్ష, ముఖాముఖి ఇంటర్వ్యూల ద్వారా అర్హులను ఎంపిక చేస్తామని, రిలేషన్‌ షిప్‌ మేనేజర్‌ పోస్టుకు 2022 తర్వాత ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అర్హులని పేర్కొన్నారు. ఎంపికై న వారికి న్యూఢిల్లీలో 15 రోజుల ఉచిత వసతితో కూడిన శిక్షణ ఇచ్చాక, తెలంగాణ జిల్లాల్లో పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు.

బీఈడీ కళాశాల

ప్రిన్సిపాల్‌గా నాగమణి

భద్రాచలంటౌన్‌: భద్రాచలం బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్‌గా ధనసరి నాగమణి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాల్‌ భవాని నుంచి ఆమె బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం ఐటీడీఏ పీఓ బి.రాహుల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే భద్రాచలం సర్పంచ్‌ పూనెం కృష్ణ తదితరులు ప్రిన్సిపాల్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

22వరకు ఐటీఐలో

ప్రవేశాలు

ఖమ్మం సహకారనగర్‌: ఖమ్మం టేకులపల్లిలోని ప్రభుత్వ ఐటీఐ, ఏటీసీలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఈనెల 22వ తేదీ వరకు స్పాట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ జి.సక్రు తెలిపారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు నేరుగా కళాశాలకు వచ్చి ప్రవేశం పొందొచ్చని, దరఖాస్తు చేసుకోని వారు కూడా ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో వస్తే ప్రవేశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు https://iti.telangana.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకుని, ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో కళాశాలకు హాజరుకావాలని సూచించారు.

సురక్షిత, నాణ్యమైన

వైద్యసేవలే లక్ష్యం

ఖమ్మం వైద్యవిభాగం: జిల్లాలోని ఆస్పత్రుల్లో సురక్షితమైన, నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ రామారావు తెలిపారు. ఈమేరకు రోగి భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. నాణ్యమైన వైద్యసేవలు అందించడంతో పాటు వైద్య సేవల సమయాన సంభవించే అనుకోని ప్రమాదాలను నివారించడం, భద్రతపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ ఉద్దేశమని వెల్లడించారు. ఇందుకోసం ఆస్పత్రుల్లో అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. అయితే, వైద్యులు, నర్సింగ్‌, పారామెడికల్‌ సిబ్బంది కూడా మందుల వినియోగం, శస్త్రచికిత్సలు, సురక్షితమైన రక్త మార్పిడి, వైద్య పరికరాల వినియోగంపై శ్రద్ధ వహించాలని, బయో వ్యర్థాల నిర్వహణ నిబంధనల ప్రకారం చేపట్టాలని సూచించారు. ఇందుకు సంబంధించి శిక్షణ, కరపత్రాల ద్వారా ప్రచారం చేయనున్నట్లు డీఎంహెచ్‌ఓ ఓ ప్రకటనలో తెలిపారు.

పీజీ సీట్లు సాధించిన గురుకుల విద్యార్థినులు

ఖమ్మం అర్బన్‌: రఘునాథపాలెంలోని ఎంజేపీటీబీసీ మహిళా డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన పలువురు విద్యార్థినులు రాష్ట్రంలోని వివి ధ విశ్వవిద్యాలయాల్లో పీజీ సీట్లు సాధించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పి.శ్రావణి, ఓ.స్రవంతి, వై.రేవతి, ఉజ్వల సీట్లు సాధించగా, కాకతీయ విశ్వవిద్యాలయంలో వి.అశ్విని, బి.జ్యోతి, జి.శ్రీజ, సాయి ప్రసన్నతో పాటు ఎంజీ విశ్వవిద్యాలయంలో డి.కవిత వివిధ విభాగాల్లో పీజీ సీట్లు సాధించారని ప్రిన్సిపాల్‌ వై.నాగేశ్వరరావు తెలిపారు. విద్యార్థినులను ప్రిన్సిపాల్‌తో పాటు ఆర్‌సీఓ రాంబాబు, ఏటీపీ కల్పన, అధ్యాపకులు అభినందించారు.

ప్రభుత్వ స్థలాల

లభ్యతపై ఆరా

నేలకొండపల్లి: ప్రభుత్వ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయని క్షేత్ర స్థాయిలో డిప్యూటీ కలెక్టర్‌ అపూర్వ పరిశీలించారు. మండలంలోని మోటాపురం, సధాశివాపురం, రామచంద్రాపురం గ్రామాల్లో శుక్రవారం పర్యటించిన ఆమెను ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను పరిశీలించడమే కాక ఇళ్ల నిర్మాణాలకు అనువుగా ఉన్నాయా, లేదా అని ఆరా తీశారు. గ్రామాల వారీగా ఖాళీ స్థలాలు, లబ్ధిదారుల వివరాలు తెలుసుకున్నారు. ఇప్పటికే లబ్ధిదారులను గుర్తించారా, స్థలం తక్కువగా ఉండి లబ్ధిదారులు ఎక్కువగా ఉంటే ఎలా ఎంపిక చేస్తారని ప్రశ్నించారు. ఎంఆర్‌ఐ ఆలస్యం మధుసూధన్‌రావు, జీపీఓలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement