వెల్లివిరిసిన మతసామరస్యం | - | Sakshi
Sakshi News home page

వెల్లివిరిసిన మతసామరస్యం

Sep 19 2026 12:22 AM | Updated on Sep 19 2026 12:22 AM

మధిర: మధిరలో గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మతసామరస్యం వెల్లివిరిసింది. మధిర స్విమ్మర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యాన గురువారం వినాయక నిమజ్జనం నిర్వహించగా హిందువులతో పాటు ముస్లిం, క్రిస్టియన్‌ యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామి చేతిలోని లడ్డూను వేలం వేయగా కలర్స్‌ రెడీమేడ్‌ షోరూమ్‌ అధినేత పాషా రూ.12,016కు దక్కించుకున్నారు. అంతేకాక జానీ, సుకూర్‌ తదితరులు ప్రసాదం చేయించి భక్తులకు పంపిణీ చేశారు.

పెద్దమ్మతల్లికి

పంచామృతాభిషేకం

పాల్వంచరూరల్‌: పెద్దమ్మతల్లి అమ్మవారికి వైభవంగా పంచామృతాభిషేకం నిర్వహించా రు. మండలంలోని శ్రీ కనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయంలో శుక్రవారం అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్‌కు పంచామృతంతో అభిషేక పూజలు, పంచహారతులు, నివేదన, నీరా జనం, మంత్రపుష్పం పూజలతోపాటు కుంకుమపూజ, గణపతిహోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ విజయ్‌కుమార్‌తో పాటు అర్చకులు పాల్గొన్నారు.

రూ.12,016కు లడ్డూ దక్కించుకున్న

ముస్లిం యువకుడు పాషా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement