కలెక్టర్‌ను కలిసిన బీఆర్‌ఎస్‌ బృందం | - | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌ను కలిసిన బీఆర్‌ఎస్‌ బృందం

Sep 19 2026 12:22 AM | Updated on Sep 19 2026 12:22 AM

ఖమ్మం సహకారనగర్‌/బోనకల్‌: జిల్లాలోని పలు ప్రాంతాల ప్రజలు, రైతుల సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కోరారు. ఈ సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌.కు వినతిపత్రం అందజేశారు. అనంతరం మధు, సండ్ర మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లకు లబ్ధిదారుల ఎంపిక నిబంధనలకు విరుద్ధంగా జరుగుతోందని, అధికార పార్టీ నేతలు జాబితాలను విచారణకు పంపిస్తున్నారని తెలిపారు. ఈమేరకు సర్పంచ్‌ల హక్కులు, స్థానిక సంస్థల స్వయంప్రతిపత్తిని కాపాడేలా గ్రామసభల్లోనే నిరుపేదలను ఎంపిక చేయాలని కోరారు. అలాగే, తల్లాడ మండలంలోని సిరిపురం మేజర్‌ కాల్వ ఆధునికీకరణ పనుల పూర్తి, పెనుబల్లి మండలంలోని రాతోని, తాళ్లపెంట ఎత్తిపోతల పథకాల పరిధిలో ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు, రఘునాథపాలెం మండలం జింకలతండాలో గత ఈద్గా, ఖబరస్తాన్‌ ఏర్పాటుకు స్థలాల కేటాయింపుపై దృష్టి సారంచాలని వారు కలెక్టర్‌ను కోరారు. ఈకార్యక్రమంలో నాయకులు బెల్లం వేణుగోపాల్‌, రావూరి శ్రీనివాస్‌, బానోత్‌ కొండా, బిళ్లగిరి ధనుంజయ, మేదరమెట్ల శ్రీనివాస్‌, సైదారెడ్డి, బిక్కి కష్ణప్రసాద్‌, బంక మల్లయ్య, బలుసు మురళీకష్ణ, మహమ్మద్‌ రఫీ, ముత్యం కష్ణారావు, బానోత్‌ రవి, ధరావత్‌ శంకర్‌, షేక్‌ చందు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement