సంక్షేమం, పారదర్శక పాలనే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

సంక్షేమం, పారదర్శక పాలనే లక్ష్యం

Sep 18 2026 12:15 AM | Updated on Sep 18 2026 12:15 AM

ఖమ్మం సహకారనగర్‌: ప్రజల సంక్షేమం, పారదర్శక పాలనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అదనపు కలెక్టర్‌(స్థానిక సంస్థలు) డాక్టర్‌ పి.శ్రీజ తెలిపారు. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా గురువారం ఆమె కలెక్టరేట్‌లో జాతీయ జెండా ఆవిష్కరించాక మాట్లాడారు. ప్రజాస్వామ్య పాలనకు నాంది పలికిన చారిత్రక రోజును ప్రభుత్వం ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహిస్తోందన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు అధికారులు అందుబాటులో ఉండాలని, నిబంధనల ప్రకారం పారదర్శకంగా పరిష్కరించడడాన్ని విధిగా భావించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌(రెవెన్యూ) పి.శ్రీనివాస రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి రామమూర్తి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

అధికారుల సెల్ఫీలు..

ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లో జెండా ఆవిష్కరించాక ఎఫ్‌ఎల్‌ఎన్‌ స్టాండ్‌(సెల్ఫీ స్టాండ్‌) వద్ద అదనపు కలెక్టర్లు శ్రీజ, శ్రీనివాసరెడ్డి సెల్ఫీలు దిగారు. డీఈఓ సదానందం, ఏఎంఓ పెసర ప్రభాకర్‌రెడ్డి కూడా ఎఫ్‌ఎల్‌టీం సభ్యులతో ఫొటోలు దిగారు. ఫౌండేషనల్‌ లిటరసీ అండ్‌ న్యూమరసీ(ఎఫ్‌ఎల్‌ఎన్‌)లో జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానాన నిలవడంపై అభినందనలు తెలిపారు.

అదనపు కలెక్టర్‌ శ్రీజ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement