కమ్యూనిస్టుల త్యాగ ఫలితమే విలీనం | - | Sakshi
Sakshi News home page

కమ్యూనిస్టుల త్యాగ ఫలితమే విలీనం

Sep 18 2026 12:15 AM | Updated on Sep 18 2026 12:15 AM

ఖమ్మంమయూరిసెంటర్‌: కమ్యూనిస్టుల త్యాగ ఫలి తంగానే తెలంగాణ ప్రాంతం దేశంలో విలీనమైతే.. ఈ విషయాన్ని కొందరు వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు పేర్కొన్నారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సందర్భంగా గురువారం ఖమ్మంలోని సీపీఐ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి దండి సురేష్‌ అధ్యక్షతన జరిగిన సభలో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అలాగే, అమరవీరులకు నివాళులర్పించాక హేమంతరావు మాట్లాడుతూ..నిజాం రాజు స్వతంత్రుడిగా ప్రకటించుకుని పాలన సాగిస్తున్నప్పుడు కమ్యూనిస్టులు సాయుధ పోరాటానికి పిలుపునిచ్చారన్నారు. ఈక్రమాన నాలుగున్నర వేల మంది ప్రాణాలు అర్పించాకే తెలంగాణ ప్రాంతం దేశంలో విలీనమైందని తెలిపారు. నాయకులు జమ్ముల జితేందర్‌రెడ్డి, మహ్మద్‌ మౌలానా, యర్రా బాబు, సిద్దినేని కర్ణకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా, సీపీఐ ఆధ్వర్యాన హైదరాబాద్‌లో జరిగిన సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సభకు ఖమ్మం నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు వెళ్లారు.

వారోత్సవాల ముగింపు సభలో బాగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement