విద్యుత్ అధికారుల పొలంబాట
96 ఏళ్ల తర్వాత భూముల రీసర్వే
ప్రజాపాలన దినోత్సవంలో
డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క
విద్యారంగానికి ప్రోత్సాహం
దశల వారీగా రీ సర్వే..
సాక్షిప్రతినిధి, ఖమ్మం: రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క వెల్లడించా రు. 77 ఏళ్ల క్రితం ఇదే రోజున తెలంగాణ ప్రాంతం దేశంలో అంతర్భాగంగా మారినందున చర్రితలో సెప్టెంబర్ 17కు విశిష్ట స్థానం ఉందని పేర్కొన్నా రు. అందుకే ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవం నిర్వహిస్తోందని తెలిపారు. ప్రజాపాలన దినోత్స వం సందర్భంగా గురువారం ఖమ్మంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో డిప్యూటీ సీఎం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అలాగే, తెలంగాణ అమరవీరుల కుటుంబాలను సన్మానించి శాఖల వారీగా ఏర్పాట్లు చేసిన స్టాళ్లను పరిశీలించారు. కలెక్టర్ దివా కర టీ.ఎస్., సీపీ సునీల్‌దత్, సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి, డీఆర్‌ఓ రామ్మూర్తి, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశంలో భట్టి మాట్లాడుతూ ప్రతీ కుటుంబ సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగుతోందని తెలిపారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి ప్రసంగం ఆయన మాటల్లోనే...
మహిళలకు అండగా..
మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం. జిల్లాలో 6,39,31,602 మంది మహిళలు ఉచితంగా ప్రయాణించగా, వారికి రూ. 343.44 కోట్ల చార్జీలు ఆదా అయ్యాయి. ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించింది. అలాగే, 2,45,233 మందికి 18,69,122 సిలిండర్లను రూ.500కే అందించాం. గృహజ్యోతి ద్వారా 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే 2,49,454 కుటుంబాల బిల్లులు రూ.257.22 కోట్లను ప్రభుత్వం భరించింది.
రైతు సంక్షేమానికి ప్రాధాన్యత
రాష్ట్రంలో రైతు సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తున్నాం. రైతు భరోసా ద్వారా జిల్లాలో 3,41,913 మంది రైతులకు రూ.427.96 కోట్లు అందించగా, రుణ మాఫీ ద్వారా 1,31,760 మంది రైతులకు రూ.912.61 కోట్ల మాఫీ చేశాం. కనీస మద్దతు ధరతో 44,568 మంది రైతుల నుంచి 283956.397 మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలు, 2025–26 యాసంగిలో 245 20,085 మంది రైతుల నుంచి 14,62,411.60 క్వింటాళ్ల ధాన్యాన్ని సేకరించాం. అలాగే, వ్యవసాయానికి శాశ్వత భరోసా కల్పించేందుకు సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేశాం. సీతారామ ఎత్తిపోతల పథకం, పాలేరు లింక్ కాలువ ద్వారా 1,38,790 ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీటి వసతి కల్పిస్తున్నాం. మున్నేరు – పాలేరు లింక్ కాల్వకు రూ.107.651 కోట్లు, జవహర్ లిఫ్ట్‌కు రూ.630.30 కోట్లు కేటాయించాం.
ఆర్ధిక శక్తిగా మహిళా సంఘాలు
మహిళా స్వయం సహాయక సంఘాలను ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దుతున్నాం. ఈమేరకు 4,008 సంఘాలకు రూ.394.80 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు, 555 సంఘాలకు రూ.16.36 కోట్ల సీ్త్రనిధి రుణాలు, 52,059 సంఘాలకు రూ.57.15 కోట్ల వడ్డీలేని రుణాలు అందించాం. ఇందిరా మహిళా డెయిరీ ద్వారా మధిర నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో తొలి దశగా రూ.2కోట్లతో 125 యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాం. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా తొలి దశలో 11,427 ఇళ్లు పూర్తయ్యాయి.
జిల్లాకు కొత్తగా 41 సబ్ స్టేషన్లు మంజూరు చేశాం. రైతుల విద్యుత్ సమస్యలను తెలుసుకుని పరిష్కరించేలా అధికారులు ‘పొలంబాట’ నిర్వహిస్తున్నారు. ఎంపిక చేసిన 27 గ్రామాల్లో రూఫ్ టాప్ సోలార్, సౌర పంపుసెట్లు ఏర్పాటు చేస్తున్నాం. అలాగే, 379 ప్రభుత్వ పాఠశాలల్లో 1,768 కిలోవాట్ల సోలార్ ప్లాంట్లు ఏర్పాటవుతున్నాయి.
సెప్టెంబర్ 17కు చరిత్రలో ప్రత్యేక స్థానం
ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీలో జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానాన, పనితీరు గ్రేడింగ్ సూచీలో ఐదో స్థానాన నిలిచింది. ఈ ఏడాది అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అల్పాహారం అందిస్తున్నాం. ఐదు నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు ఏర్పాటు చేస్తున్నాం.
భూ రికార్డుల నవీకరణలో భాగంగా దాదాపు 96 ఏళ్ల తర్వాత భూ రీసర్వే ప్రక్రియ ప్రారంభించాం. తెలంగాణ సర్వే అండ్ బౌండరీస్ చట్టం–1923 ప్రకారం జిల్లాలో దశలవారీగా రీసర్వే జరుగుతుంది. తిరుమలాయపాలెం మండలం కాకరవాయి, సత్తుపల్లి మండలం బేతుపల్లి, కూసుమంచి మండలం భగవత్‌వీడులో సర్వే మొదలైంది.


