రజాకార్లపై సమరశంఖం | - | Sakshi
Sakshi News home page

రజాకార్లపై సమరశంఖం

Sep 17 2026 12:08 AM | Updated on Sep 17 2026 12:08 AM

రజాకార్లపై సమరశంఖం

కొణిజర్ల, తనికెళ్ల ప్రాంతాలకు చెందిన మల్లెల వెంకటేశ్వరరావు, నల్లమల గిరిప్రసాద్‌, షేక్‌ రజాక్‌ అలీ దళాల్లో పనిచేశారు. తనికెళ్లపై పడిన రజాకార్లు ప్రజలను తీవ్రంగా హింసించారు. దళ నాయకుడు గడల సీతారామయ్య ఆచూకీ కోసం వేధించగా, గ్రామస్తులు మరొకరి మృతదేహాన్ని చూపించి సీతారామయ్యను కాపాడుకున్నారు. ఇక 1948 జనవరి 15న ఎర్రుపాలెం మండలం మీనవోలు ప్రజలు రజాకార్ల సైన్యంపై ఈటెలతో విరుచుకుపడ్డారు. బ్రిటిష్‌ అధికారి సార్జెంట్‌ చేసిన విచక్షణారహిత కాల్పుల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ తిరుగుబాటును అణచివేసేందుకు నిజాం సర్కార్‌ రైలులో రజాకార్లను రప్పించి ఇళ్లను తగలబెట్టడంతో ప్రజలు గ్రామాన్ని విడిచి వెళ్లాల్సి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement