ఖమ్మం సహకార నగర్: నిబంధనలకు విరుద్ధంగా అధికారుల దాడులు, వేధింపులకు నిరసనగా ఉమ్మడి జిల్లాలో రైస్‌మిల్లుల నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చినట్లు అసోసియేషన్ బాధ్యులు వెల్లడించారు. ఈమేరకు ఖమ్మం కలెక్టరేట్ వద్ద ధర్నాచౌక్‌లో మంగళవారం నిరసన తెలిపిన అనంతరం కలెక్టర్ దివాకరకు వినతిపత్రం అందజేశారు. ఆతర్వాత మిల్లర్ల అసోసియేషన్ బాధ్యులు మాట్లాడుతూ సామర్థ్యానికి మించి ధాన్యం కేటాయించడమే కాక బియ్యం సేకరణలో జాప్యంతో తాము ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. అంతేకాక తేమ విషయంలోనూ నష్టాన్ని భరిస్తున్నామని పేర్కొన్నారు. ఇక బియ్యం సిద్ధంగా ఉన్నా, గోదాంలు ఖాళీ లేవని నెలల పాటు జాప్యం చేస్తూ.. మరోపక్క మిల్లర్లను బాధ్యులుగా చేసి వడ్డీ, జరిమానా విధించడం సరికాదని తెలిపారు. అంతేకాక గత ఎనిమిదేళ్లుగా రవాణా చార్జీలు, గోదాము అద్దె ప్రభుత్వం చెల్లించడం లేదని వెల్లడించారు. ఇవన్నీ పక్కన పెట్టి అధికారులు మిల్లుల్లో తనిఖీల ద్వారా తమను వేధిస్తున్నారని, లెక్కల్లో స్వల్ప తేడా వస్తే రీ–కౌంటింగ్‌కు నిరాకరిస్తూ కేసులు నమోదు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి బకాయిలు చెల్లించడమే కాక తనిఖీల పేరిట వేధింపులు నిలిచివేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చిన వారిలో రైస్ మిల్లర్ల అసోసియేషన్ ఖమ్మం, భద్రాద్రి జిల్లాల అధ్యక్షుడు బొమ్మ రాజేశ్వరరావు, జుగల్‌కిషోర్ భండేల్‌వాల్‌తో పాటు జవ్వాజి నగేష్, వై.శ్రీనివాస్‌రెడ్డి, చలువాది నగేష్, పల్లెపోతు శ్రీనివాస్, మామిళ్లపల్లి రాంబాబు, వనమా సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి జిల్లాలో రైస్‌మిల్లుల
నిరవధిక బంద్


