మక్క రైతుల విలవిల | - | Sakshi
Sakshi News home page

మక్క రైతుల విలవిల

Sep 16 2026 4:01 AM | Updated on Sep 16 2026 4:01 AM

● అయినా ఇప్పటివరకు నగదు అందక ఎదురుచూపులు ● జిల్లా రైతులకు రూ.50కోట్ల మేర బకాయి? అప్పులకు వడ్డీ పెరుగుతోంది రూ.4లక్షలకు పైగా రావాలి

ఫెయిల్‌ అయిందని సాకులు

సీడ్‌ పంట అమ్మి నెలలు..
● అయినా ఇప్పటివరకు నగదు అందక ఎదురుచూపులు ● జిల్లా రైతులకు రూ.50కోట్ల మేర బకాయి?

కొణిజర్ల: ఓ వైపు పెరిగిన పెట్టుబడుల భారం. మళ్లీ పంట వేద్దామన్నా ఎల్‌నినో కారణంగా నిరాశ.. ఈ పరిస్థితుల్లో గత రబీలో పంట అమ్మిన డబ్బులు కూడా అందక మొక్కజొన్న రైతులు ఆందోళన చెందుతున్న వైనమిది. జిల్లాలోని పలు మండలాల రైతులు గత రబీలో సీడ్‌ మొక్క(ఆడ – మగ) జొన్న సాగు చేశారు. ఆపై ఆర్గపైజర్లకు పంట అప్పగించగా, డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుండడంతో కొత్త అప్పు పుట్టక అల్లాడి పోతున్నారు.

వేలాది మంది సాగు

జిల్లాలోని కొణిజర్ల, వైరా, తల్లాడ, ఏన్కూరు. బోనకల్‌, చింతకాని తదితర మండలాలకు చెందిన సుమారు 6వేల మందికి పైగా రైతులు పలు కంపెనీలకు చెందిన సీడ్‌ మొక్కజొన్న సాగు చేశారు. రబీలో సాగు చేసిన పంటను ఆరు నెలల క్రితమే ఏపీలోని ఓ ప్రైవేట్‌ విత్తన కంపెనీకి చెందిన ఆర్గనైజర్లకు అప్పగించారు. వారం రోజుల్లోనే ఖాతాల్లో నగదు జమ చేస్తామని చెప్పిన ఆర్గనైజర్లు, స్థానిక ఏజెంట్లు ఆ తర్వాత ముఖం చాటేశారు. అధిక దిగుబడి వస్తుందని, ఎక్కువ ధర చెల్లిస్తామని ఆశ చూపి తీరా డబ్బులు ఇవ్వకుండా తిప్పుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని మండలాల్లో కలిపి రైతులకు దాదాపు రూ.50 కోట్ల మేర బకాయి ఉండొచ్చని తెలుస్తోంది. అధిక ధర వస్తుందని నమ్మి భారీగా పెట్టుబడి పెట్టడమే కాక భూమి కౌలు ముందే చెల్లించి సాగు చేశారు. తీరా డబ్బు అందకపోవడం.. కొత్తగా పంటల సాగుకు అప్పులు పుట్టక ఇబ్బంది పడుతున్నారు.

నాకు ఎకరం భూమి ఉంది. అందులో ఏలూరు ఆర్గనైజర్‌ ద్వారా తీగలబంజర్‌ ఏజెంట్‌ ఇచ్చిన సీడ్‌ మొక్కజొన్న సాగుచేశా. 40 క్వింటాళ్ల దిగుబడి వస్తే ఆర్గనైజర్‌కు అప్పగించా. ఆరు నెలలు దాటినా డబ్బులు ఇవ్వడం లేదు. అప్పులకు వడ్డీ పెరిగి పోతోంది. ఇకనైనా మా రైతుల బాధలను మంత్రులు, జిల్లా అధికారులు, నేతలు గుర్తించి తక్షణమే డబ్బులు ఇప్పించాలి.

– భూక్యా సుమన్‌, మేకలకుంట

సొంత భూమి ఎకరానికి తోడు మరో ఐదెకరాలు కౌలుకు తీసుకుని సీడ్‌ మొక్క జొన్న సాగుచేశా. కౌలు, పెట్టుబడి కలిపి ఎకరాకు రూ.90 వేలు ఖర్చయింది. ఎకరాకు 40 క్వింటాళ్ల చొప్పున 200 క్వింటాళ్లు వచ్చింది. రూ.3.200 క్వింటా చొప్పున కొనుగోలు చేసి రూ.1.50 లక్షలే ఇచ్చారు. ఇంకా రూ.4 లక్షలకు పైగా నగదు కోసం ఆర్గనైజర్‌ చుట్టూ తిరుగుతున్నా.

– పామర్తి బసవయ్య, రైతు, సింగరాయపాలెం

కొణిజర్ల మండలంలోని మేకలకుంట, సిద్దిక్‌నగర్‌, సింగరాయపాలెం, మల్లుపల్లి, సాలెబంజర తదితర గ్రామాలతో పాటు ఏన్కూరు మండలం రేపల్లెవాడకు చెందిన రైతులు ఏపీ ఏలూరు ప్రాంతంలోని ఆర్గనైజర్‌ వద్ద సీడ్‌ మొక్కజొన్న కొనుగోలు చేశారు. వీరికి తీగలబంజరకు చెందిన ఓ రైతు ఏజెంట్‌గా వ్యవహరించాడు. అయితే విత్తనం ఫెయిల్‌ అయిందని, డీఎన్‌ఏ పరీక్షలు చేయాలంటూ వివిధ కారణాలు చెబుతూ డబ్బు ఇవ్వకుండా వాయిదాలు వేస్తున్నాడని సమాచారం. దాదాపు ఆరు నెలలు గడిచినా ఫలితం లేకపోవడంతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వైరా ఎమ్మెల్యే మాలోత్‌ రాందాస్‌నాయక్‌, కలెక్టర్‌ దివాకర దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి తమకు నగదు అందేలా చూడాలని బాధిత రైతులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement