మధిర: మధిర మండలం యండపల్లి గట్టు సమీపాన వ్యవసాయ భూముల నుంచి అక్రమంగా మట్టిని తరలిస్తున్న లారీని మంగళవారం రైతులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఉమ్మడి ఏపీలో పేదలకు కేటాయించిన భూముల నుంచి అనుమతి లేకుండా మట్టి తరలిస్తున్నారని ఆరోపించారు. ఏళ్లుగా సాగు చేసుకుంటున్న రైతుల హక్కులను పరిరక్షించాలని రైతు సంఘం నాయకుడు మందడపు ఉపేందర్‌రావు కోరారు. ఈ విషయం తెలుసుకున్న రూరల్ ఎస్సై విశ్వతేజ చేరుకుని రైతులతో చర్చించారు. సమస్యను తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పడంతో వారు ఆందోళన విరమించారు.


