కూసుమంచి: వినాయక చవితి పండుగ రోఉన మండలంలోని పోచారంలో విషాదం అలుముకుంది. గ్రామానికి చెందిన ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ సట్టు శ్రీను(48) తన కుమార్తె నిశితతో కలిసి సోమవారం కూరగాయల కొనుగోలు నిమిత్తం ద్విచక్ర వాహనంపై కూసుమంచి వచ్చాడు. అక్కడి నుంచి తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా కూసుమంచి పాత పోస్ట్ ఆఫీస్ వద్ద వినాయక విగ్రహాన్ని తీసుకెళ్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. ట్రాక్టర్ డ్రైవర్ వేగంగా, అజాగ్రత్తగా నడపడంతో ట్రక్కు ముందు భాగం శ్రీను బలంగా తాకగా తల రెండు ముక్కలుగా చీలి అక్కడకక్కడే మృతి చెందాడు. ఘటనలో ఆయన కుమార్తెకు సైతం తీవ్ర గాయాలయ్యాయి. కాగా, కళ్ల ముందే తండ్రి మృతి చెందగా తీవ్రగాయాల పాలైన నిశిత రోదించిన తీరు స్థానికులను కలిచివేసింది. కాగా, శ్రీనుకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు.
బైక్‌ను ట్రాక్టర్ ఢీకొట్టడంతో ప్రమాదం


