నాగోలు/ఇల్లెందు: పాత గొడవల నేపథ్యాన ఓ రౌడీషీటర్‌ను దుండగులు కళ్లలో కారం చల్లి వెంబడించి వేట కొడవలితో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. నాగోలు పోలీసులు తెలిపిన మేరకు.. భద్రాద్రి జిల్లా ఇల్లెందుకు చెందిన మహ్మద్ నయీమ్(34), అదే ప్రాంతానికి చెందిన ఉమామహేశ్వర్‌రావు అలియస్ మహేష్ చిన్ననాటి స్నేహితులు. వీరు పలు కేసుల్లో ఉండగా ఇల్లెందులో రౌడీషీట్ తెరిచారు. దీంతో నయీమ్ నాగోలు బండ్లగూడ రాజీవ్ స్వగృహకు మకాం మార్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఇక్కడ కూడా సెటిల్‌మెంట్లు చేస్తుండడంతో ఉప్పల్, నగరంలో కేసులు నమోదయ్యాయి. ఈక్రమాన సెటిల్‌మెంట్ డబ్బు విషయమై వివాదంలో నయీమ్‌ను చంపివేస్తానని మహేష్ హెచ్చరించాడు. సోమవారం రాత్రి బండ్లగూడలోని సుప్రీం వైన్స్ వద్ద ఇల్లెందుకు చెందిన రవి, ఖమ్మంకు చెందిన సాయి, వెంకటేష్‌తో కలిసి మద్యం తాగుతుండగా ప్రభుత్వ వాహనం బోర్డు ఉన్న కారులో వచ్చి నయీమ్ కళ్లల్లో కారం చల్లి వేట కొడవళ్లు, కత్తులతో దాడి చేశారు. పారిపోయే ప్రయత్నంలో ఇనుప కడాయి(పెద్దపాత్ర)తో తలపై కొట్టగా అక్కడికక్కడే మృతి చెందాడు. ఆపై నిందితులు కారులో పారిపోయారు. పోలీసులు చేరుకుని నయీమ్‌తో పాటు మద్యం సేవించిన వారినే కాక నయీమ్ హత్యలో పాల్గొన్న నిందితుల్లో ఆరుగురిని అదుపులోకి తీసుకోగా, వీరిలో మహేష్ ఉన్నట్లు సమాచారం. కాగా, హత్య జరిగిన వైన్స్‌లోని సీసీ కెమెరాల వీడియోలు కలకలం సృష్టించాయి.
నిందితుల్లో ఖమ్మం వాసి?
ఖమ్మంక్రైం: నయీమ్ హత్య ఘటనలో ఖమ్మం వాసి ఉన్నట్లు తెలిసింది. హైదరాబాద్ నుంచి వచ్చిన పోలీసులు కాల్వొడ్డు ప్రాంతానికి చెందిన ఓ రౌడీషీటర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
అంతమొందించిన చిన్ననాటి స్నేహితుడు?


