గిరిజనుల ఆత్మగౌరవాన్ని పెంచిన కేసీఆర్‌ | - | Sakshi
Sakshi News home page

గిరిజనుల ఆత్మగౌరవాన్ని పెంచిన కేసీఆర్‌

Sep 16 2026 4:01 AM | Updated on Sep 16 2026 4:01 AM

ఖమ్మం వైరారోడ్‌: గిరిజనుల దశాబ్దాల ఆకాంక్షను గుర్తించి పది శాతం ఎస్టీ రిజర్వేషన్‌ అమలు చేయడమే కాక తండాలను గ్రామపంచాయతీలుగా మార్చి గిరిజనులకు స్వయం పాలన, రాజకీయ ప్రాతినిధ్యం కల్పించిన ఘనత కేసీఆర్‌దేనని వైరా మాజీ ఎమ్మెల్యే చంద్రావతి పేర్కొన్నారు. ఖమ్మంలోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆమె మాట్లాడారు. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయాన గిరిజనులకు ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని విమర్శించారు. ఇకనైనా గిరిజన యువతకు ఉద్యోగావకాశాలు, పోడు భూముల సమస్యలు, తండాల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. కాగా, కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాక గిరిజనులకు రిజర్వేషన్ల కల్పన, తండాలు గ్రామపంచాయతీలుగా మార్చిన కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపేలా ఈనెల 17న నిర్వహించనున్న కార్యక్రమాల్లో గిరిజనులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని చంద్రవతి కోరారు. ఈ సమావేశంలో నాయకులు వసంత, బదావత్‌ అనూష, బుగ్లోత్‌ మాధవి, బానోత్‌ దిక్షంనాయక్‌, జర్పుల బాలాజీ, బోడా మంచానాయక్‌, అమర్‌సింగ్‌, బోడా వీరకుమార్‌, భూక్యా సాయి, ధరావత్‌ శంకర్‌, బానోత్‌ కొండా, బానోత్‌ కిషన్‌, లకావత్‌ గిరిబాబు, మంచానాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే చంద్రావతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement