అను‘బంధం’ తీర్చుకుంది.. | - | Sakshi
Sakshi News home page

అను‘బంధం’ తీర్చుకుంది..

Sep 16 2026 4:01 AM | Updated on Sep 16 2026 4:01 AM

వైరా: కడవరకు కలిసి జీవించాలని ప్రమాణం చేసిన భర్త రోడ్డుప్రమాదంలో తనువు చాలించాడు. సంతానం కూడా లేకపోవడంతో మిగతా జీవితం ఒంటరిగా జీవించాలనే బాధనుపంటి బిగువున భరిస్తూ నే ఆయన భార్య తలకొరివి పెట్టి కన్నీటి వీడ్కోలు పలికిన ఘటన ఇది. వైరా మున్సిపాలిటీ 9వ వార్డుకు చెందిన పువ్వాళ్ల వెంకటేశ్వరరావు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. అయితే, వెంకటేశ్వర్లుకు పిల్లలు లేకపోవడంతో ఆయన భార్య కళావతి కుండ మోసి చితికి నిప్పంటించింది. మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ కట్ల సంతోష్‌, నాయకులు చెరుకూరి కిరణ్‌, కర్నాటి హన్మంతరావు, పొదిల హరినాధ్‌, కోసూరి శ్రీనివాసరావు, కొల్లి రమేష్‌, మద్దెల రవి, తదితరులు కుటుంబీకులను పరామర్శించారు.

భర్తకు తలకొరివి పెట్టిన మహిళ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement