మధిర/ఎర్రుపాలెం: మధిర, ఎర్రుపాలెం మండలా ల్లో రైతుల సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని గోదావరి జలాలను సాగర్ కాల్వ ద్వారా విడుద ల చేశారు. మధిర మండలం నాగవరప్పాడు గ్రామ సమీపంలోని నిధానపురం మేజర్‌తో పాటు ఎర్రుపాలెం మండలం తక్కెళ్లపాడులోని చెరువు వద్దకు నీరు చేరడంతో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పూజలు చేశారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యాన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సూచనలతో నీరు విడుదల చేయగా, మధిర బ్రాంచ్ కాల్వ ద్వారా మధిర మండలానికి, నిధానపురం మేజర్ ద్వారా మధిర, ఎర్రుపాలెం మండలాలకు సాగునీరు అందనుందని వారు తెలిపారు. మార్కెట్ చైర్మన్ బండారు నరసింహారావు, డీసీసీబీ డైరెక్టర్ అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, సర్పంచ్ ముక్కర రామకృష్ణారెడ్డి, కాంగ్రెస్ మధిర మండల, పట్టణ అధ్యక్షులు పారుపల్లి విజయ్‌కుమార్, తలుపుల వెంకటేశ్వర్లు, నాయకులు శీలం ప్రతాపరెడ్డి, సూరంశెట్టి కిషోర్, కర్నాటి రామారావు, ముక్కర చిన్నలక్ష్మారెడ్డి, అయిలూరి రవీంద్రరెడ్డి, శీలం మాధవరెడ్డి పాల్గొన్నారు.


