ఖమ్మంక్రైం: ఏపీఎస్పీ పూర్వ కానిస్టేబుళ్ల (1976–77 బ్యాచ్) ఆత్మీయసమ్మేళనం గురువారం ఖమ్మంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాచ్‌లో మృతి చెందిన వారికి నివాళులర్పించారు. అనంతరం శిక్షణ, ఉద్యోగంలో ఎదురైన అనుభవాలు, ప్రస్తుత విశ్రాంత జీవితం, కుటుంబ వివరాలను పరస్పరం పంచుకున్నారు. అంతేకాక పలువురిని సత్కరించారు. ఈకార్యక్రమంలో విశ్రాంత ఎస్‌ఐలు రుద్ర వెంకటనారాయణ, నర్సింహారావు, అప్పారావు, అమిత్‌ఖాన్, అబ్దుల్‌ఘనీ, కృష్ణారెడ్డి, వెంకటరామిరెడ్డి, పురుషోత్తం, సత్తయ్య, సంపదయ్య, ఎంఎస్‌ఆర్.ఆచార్యులు, సాయిరెడ్డి నూరుద్దీన్, సోమేశ్వరరావు, రామస్వామి, సాంబంశివరావు, జయదేవరెడ్డి, రవీందర్, వీరన్న, మధుకర్ తదితరులు పాల్గొన్నారు.


