కామేపల్లి: వర్షాభావ పరిస్థితుల్లో వరికి బదులు మిర్చి సాగు చేద్దామని భావించిన రైతుకు ఆదిలోనే తెగుళ్ల రూపంలో అడ్డంకి ఎదురైంది. కామేపల్లి మండలం పండితాపురం గ్రామానికి చెందిన బొగ్గారపు నరసింహారావు 150 ప్యాకెట్ల మిరప విత్తనాలతో నారు పెంచాడు. ఒక్కో ప్యాకెట్‌కు రూ.700 చొప్పున రూ.లక్షకు పైగా వెచ్చించాడు. నారు చేతికొచ్చి నాటాలని భావిస్తున్న సమయాన కాండం కుళ్లు తెగులు సోకడంతో మిరప మొక్కలన్నీ ఎండిపోయాయి. దీంతో చేసేదేం లేక ఆశలను చంపుకుని గురువారం నారుమడిని ట్రాక్టర్‌తో దున్నించాడు. మరోపక్క నర్సరీ నుంచి రూ.1కి ఒకటి చొప్పున పదెకరాలకు సరిపడా మిర్చి నారును మరో రూ.1.50లక్షలు వెచ్చించి కొనుగోలు చేశాడు. అంతా అనుకూలిస్తేనే పెట్టుబడి వచ్చే అవకాశముందని నరసింహారావు చెబుతున్నాడు.
మిర్చి నారుకు తెగులు సోకడంతో దున్నించిన రైతు


