రఘునాథపాలెం: పోడు సాగుదారుల సమస్యల పరిష్కారానికి రఘునాథపాలెం ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం నిర్వహించిన గ్రీవెన్స్ డేకు పెద్ద ఎత్తున దరఖాస్తులు అందాయి. బోర్లకు అనుమతి కోసం 295 మంది, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు 21 మంది, ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాల కోసం 12 మంది, రైతుభరోసా కోసం ఇద్దరు దరఖాస్తులు సమర్పించారు. ఐటీడీఏ ఏపీఓ డేవిడ్‌రాజ్ ఆధ్వర్యాన దరఖాస్తులు స్వీకరించగా, డివిజనల్ ఫారెస్ట్ అధికారి భవానీశంకర్, డీటీడబ్ల్యూ ఫిరంగి, తహసీల్దార్ శ్వేత, ఎంపీడీఓ అశోక్‌కుమార్, డీఆర్‌ఓ సల్మాన్‌రాజు, ఉద్యోగులు జి.ఉపేంద్రయ్య, ఎస్.కే.అఫ్జల్ పాల్గొన్నారు. కాగా, మండలంలోని గణేశ్వరం, చింతగుర్తి, దొనబండ, మల్లేపల్లి, పంగిడి, ఈర్లపూడి తదితర గ్రామాల్లో పోడు భూమి సాగు చేస్తున్న పేద గిరిజనేతర రైతులందరికీ హక్కు పత్రాలు మంజూరు చేయాలని సీపీఎం మండల కార్యదర్శి ఎస్.నవీన్‌రెడ్డి వినతిపత్రం అందజేశారు. నాయకులు వల్లూరి శ్రీనివాసరావు, గుగులోత్ కుమార్, కూచిపూడి నరేష్, కే.నవీన్‌కుమార్, నాయకులు కృష్ణయ్య, మల్లయ్య, రమేష్, రవి తదితరులు పాల్గొన్నారు.
బోర్లు, విద్యుత్ కనెక్షన్లు, పట్టాల కోసం వినతి


