నిషేధిత జాబితా సమస్య పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

నిషేధిత జాబితా సమస్య పరిష్కరించాలి

Sep 11 2026 9:52 AM | Updated on Sep 11 2026 9:52 AM

బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోటేశ్వరరావు

ఖమ్మం మామిళ్లగూడెం: ‘22ఏ’నిషేధిత జాబితాలో భూములను చేర్చడంతో యజమానులు ఇబ్బంది పడుతున్నందున సమస్యను వెంటనే పరిష్కరించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరావు డిమాండ్‌ చేశారు. ఈమేరకు పార్టీ ఆధ్వర్యాన గురువారం కలెక్టరేట్‌ ఎదుట చేపట్టిన ధర్నాలో ఆయన మాట్లాడారు. పిల్లల పెళ్లిళ్లు, ఉన్నత విద్య, చికిత్స వంటి అత్యవసర అవసరాలకు భూమి విక్రయించాలనుకున్నా జాబితా అడ్డంకిగా మారిందని తెలిపారు. ప్రభుత్వం సత్వరమే స్పందించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం అదనపు కలెక్టర్‌ శ్రీనివాసరెడ్డికి వినతిపత్రం అందజేశారు. నాయకులు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, సన్నె ఉదయ్‌ప్రతాప్‌, గల్లా సత్యనారాయణ, రుద్ర ప్రదీప్‌, నంబూరి రామలింగేశ్వరరావు, వాకదాని పుల్లారావుయాదవ్‌, దొంగల సత్యనారాయణ, వీరభద్రం, వీరెల్లి రాజేష్‌, నున్నా రవి, నాగేశ్వరావు, రవిరాథోడ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మంఅర్బన్‌: నిషేధిత భూముల జాబితా అంశంపై కలెక్టరేట్‌ ముట్టడికి యత్నించిన బీజేపీ నాయకులపై కేసు నమోదైంది. ధర్నా అనంతరం కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావుతో పాటు మరో 11మందిపై కేసు నమోదు చేసినట్లు రఘునాథపాలెం సీఐ ఉస్మాన్‌ షరీఫ్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement