పెండింగ్‌ కేసుల పరిష్కారానికి ప్రాధాన్యత | - | Sakshi
Sakshi News home page

పెండింగ్‌ కేసుల పరిష్కారానికి ప్రాధాన్యత

Sep 10 2026 12:27 AM | Updated on Sep 10 2026 12:27 AM

కల్లూరు రూరల్‌/పెనుబల్లి: పెండింగ్‌ కేసులు త్వరగా పరిష్కారమయ్యేలా విచారణలో వేగం పెంచాలని పోలీసు కమిషనర్‌ సునీల్‌దత్‌ ఆదేశించారు. కల్లూరు పోలీసుస్టేషన్‌ను బుధవారం తనిఖీ చేసిన ఆయన రికార్డులు, పెండింగ్‌ కేసులను పరిశీలించాక మాట్లాడారు. ప్రజల నుంచి అందే ఫిర్యాదులకు తక్షణ పరిష్కారం చూపించడం ద్వారా బాధితులకు న్యాయం జరుగుతుందని తెలిపారు. అలాగే, నేరాల నియంత్రణకు పెట్రోలింగ్‌ పెంచడంతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటుతో లాభాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఇంకా రౌడీషీటర్లు, పాత నేరస్తులపై నిఘా, సమస్మాత్మక ప్రాంతాల్లో నిఘా, గంజాయి రవాణా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. ఈకార్యక్రమంలో కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్‌, సీఐ, ఎస్సైలు పాల్గొన్నారు. ఆతర్వాత పెనుబల్లి మండలం వీఎం.బంజర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో నిర్మించిన సీఐ కార్యాలయాన్ని సీపీ సునీల్‌దత్‌ ప్రారంభించారు. సీఐ ముత్తులింగయ్య, ఎస్‌ఐలు షాకీర్‌, హరిత, ప్రదీప్‌, సిబ్బంది పాల్గొన్నారు.

పోలీసు కమిషనర్‌ సునీల్‌దత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement