ఆర్‌టీఓలో సేవలకు అంతరాయం | - | Sakshi
Sakshi News home page

ఆర్‌టీఓలో సేవలకు అంతరాయం

Sep 10 2026 12:27 AM | Updated on Sep 10 2026 12:27 AM

ఖమ్మంక్రైం: జిల్లా రవాణాశాఖా కార్యాలయంలో బుధవారం సేవల కు అంతరాయం ఏర్పడింది. ఖమ్మంలో ఇంటర్నెట్‌కు సంబంధించి వైర్లు తెగిపోవడంతో సేవలు నిలిచిపోయాయి. సాయంత్రం తర్వాత మరమ్మతులు పూర్తయి ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులోకి వచ్చా యి. ఈమేరకు బుధవారం స్లాట్‌ బుక్‌ చేసుకున్న వాహనదారులు గురువారం రావాలని జిల్లా ఇన్‌చార్జ్‌ రవాణా శాఖాధికారి శ్రీనివాస్‌ సూచించారు.

డ్రైవింగ్‌ స్కూళ్ల నిర్వాహకులకు అవగాహన

పర్మినెంట్‌ డ్రైవింగ్‌ కోసం దరఖాస్తు చేసుకునే వారు మూడు గంటల వీడియో పాఠాలు విన్నాకే డ్రైవింగ్‌ టెస్ట్‌కు అనుమతించే విధానం అమల్లోకి రానుంది. ఈమేరకు బుధవారం ఉమ్మడి జిల్లాలోని డ్రైవింగ్‌ స్కూళ్ల నిర్వాహకులకు ఇన్‌చార్జ్‌ ఆర్‌టీఓ శ్రీనివాస్‌ ఆధ్వర్యాన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అవగాహన కల్పించారు. శిక్షణకు వచ్చేవారికి రోడ్డు భద్రత, ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన కల్పించడమే కాక వీడియో పాఠాల అంశాన్ని వివరించాలని తెలిపారు. ఆతర్వాత నిర్వాహకులకు ఆన్‌లైన్‌లోనే పరీక్ష నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement