పదో తరగతి మెమోలు వచ్చేశాయ్‌... | - | Sakshi
Sakshi News home page

పదో తరగతి మెమోలు వచ్చేశాయ్‌...

Sep 10 2026 12:27 AM | Updated on Sep 10 2026 12:27 AM

నేలకొండపల్లి: గత విద్యాసంవత్సరం పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థుల లాంగ్‌ మెమోలను బోర్డు విడుదల చేసింది. ఈ మెమోలను నేరుగా జిల్లాలోని పాఠశాలలకు పంపించారు. మార్చి–ఏప్రిల్‌లో జరిగిన వార్షిక పరీక్షలతో పాటు జూన్‌లో నిర్వహించిన అడ్వాన్స్‌ సప్లమెంటరీ ఫలితాల మార్కుల జాబితాలు కూడా ఇందులో ఉన్నాయి. ఆధార్‌ సంఖ్య అనుసంధానంగా కేటాయించిన పెన్‌(పర్మనెంట్‌ ఎడ్యుకేషన్‌ నంబర్‌)ను వీటిపై పొందుపరిచారు. ఈ నంబర్లు, ఇతర వివరాలను పరిశీలించాక విద్యార్థులకు అందజేయాలని హెచ్‌ఎంలకు అధికారులు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement