తల్లాడ: మండలంలోని సిరిపురం మేజర్‌తో పాటు అన్ని మేజర్ కాల్వలకు గోదావరి జలాలను విడుదల చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జల వనరుల శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. తల్లాడ మండలం అంజనాపురంలో ఆదివారం జరిగిన పలు కార్యక్రమాలకు మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రిని రైతులు కలిసి తల్లాడ మండలానికి గోదావరి జలాలు రావడం లేదని, సిరిపురం మేజర్ మరమ్మతులు జరుగుతున్నాయని చెప్పడంతో జల వనరుల శాఖ ఖమ్మం, భద్రాద్రి జిల్లాల సీఈలు వాసంతి, శ్రీనివాసరెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. మరమ్మతుల పేరుతో కాలయాపన చేయకుండా తల్లాడ మండలంలోని అన్ని మేజర్ కాల్వలకు సోమవారం నుంచి నీరు విడుదల చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్, రాయల నాగేశ్వర్‌రావు, గుత్తా వెంకటేశ్వర్లు, మారెళ్ల లక్ష్మణ్‌రావు, గొడుగునూరి లక్ష్మీరెడ్డి, డి.నరసింహారావు, జక్కంపూడి కిషోర్, కొమ్మినేని ప్రభాకర్, విద్యాసాగర్, బుద్దిసాగర్, వేమిశెట్టి నాగన్న, రామప్పారావు పాల్గొన్నారు.
అధికారులను ఆదేశించిన మంత్రి తుమ్మల


