ఇవీ మా డిమాండ్లు! | - | Sakshi
Sakshi News home page

ఇవీ మా డిమాండ్లు!

Aug 21 2026 2:51 AM | Updated on Aug 21 2026 2:51 AM

భద్రాచలం రోడ్డు స్టేషన్‌ పేరు మార్చాలని వినతి తిరుపతి, కరీంనగర్‌కు కొత్త రైళ్లు, ఆర్‌ఓబీల నిర్మాణంపై చర్చ రద్దయిన రైళ్ల పునరుద్ధరణ, హాల్టింగ్‌పై సూచనలు

ప్రతిపాదనల్లో కొన్ని...

భద్రాచలం రోడ్‌ రైల్వేస్టేషన్‌ పేరును కొత్తగూడెం లేదా భద్రాద్రి కొత్తగూడెంగా మార్చాలని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కోరారు.

దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ సంజయ్‌కుమార్‌ శ్రీవాత్సవ ఆధ్వర్యాన వచ్చే బడ్జెట్‌ ప్రతిపాదనలపై చర్చించేందుకు గురువారం హైదరాబాద్‌లో

ఎంపీల సమావేశం నిర్వహించారు. ఇందులో ఉమ్మడి జిల్లాలోని స్టేషన్ల అభివృద్ధి, పలుచోట్ల ఆర్‌ఓబీలు, ఆర్‌యూబీల నిర్మాణం, రైళ్ల ఏర్పాటు, హాల్టింగ్‌పై ఎంపీలు ప్రతిపాదనలను సమర్పించారు.

– సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/

ఖమ్మం మయూరిసెంటర్‌/

మధిర/కారేపల్లి

రైల్వే జీఎంతో భేటీలో ఎంపీలు రఘురాంరెడ్డి, వద్దిరాజు

పేరు మార్పు.. డివిజన్‌ ఏర్పాటు

భద్రాచలంరోడ్‌ రైల్వే స్టేషన్‌కు ఉన్న చరిత్ర దృష్ట్యా పేరును కొత్తగూడెం లేదా భద్రాద్రి కొత్తగూడెంగా మార్చాలని ఎంపీలు వద్దిరాజు, రఘురాంరెడ్డి కోరారు. రాబోయే రోజుల్లో భద్రాచలం మీదుగా ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, ఏపీ, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలకు కొత్త లైన్ల నిర్మాణం జరగనున్నందున స్టేషన్‌ను మరింత అభివృద్ధి చేయాలన్నారు. అంతేకాక భద్రాచలం రోడ్‌ స్టేషన్‌కు డివిజన్‌ హోదా కల్పించాలని కోరారు. అలాగే, భద్రాచలంరోడ్‌ స్టేషన్‌ నుంచి తిరుపతికి భద్రాద్రి ఎక్స్‌ప్రెస్‌ పేరుతో కొత్త రైలు, ఉత్తర, దక్షిణ తెలంగాణ మధ్య రైల్వే కనెక్టివిటీ పెంచేలా కరీంనగర్‌ – భద్రాచలంరోడ్డు మధ్య ఇంటర్‌సిటీ రైలు ఏర్పాటుకు ఫీజుబులిటీ సర్వే నిర్వహించాలని సూచించారు.

కొత్తగూడెం స్టేషన్‌ నుంచి న్యూగొల్లగూడెం రోడ్డు విస్తరణకు సంబంధించి పనులు చేపట్టాలి. ఈ స్థలానికి బదులు రైల్వేశాఖకు ఖమ్మంలో విలువైన స్థలం అప్పగింతకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధమైనందున రహదారి విస్తరణకు సహకరించాలి.

ప్రస్తుతం భద్రాచలంరోడ్‌ వరకు నడుస్తున్న కాకతీయ, సింగరేణి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను మణుగూరు వరకు పొడిగించి, కోవిడ్‌ సమయాన రద్దయిన కొల్హాపూర్‌, మణుగూరు – కాజీపేట, డోర్నకల్‌ – భద్రాచలం రోడ్‌ రైళ్లను పునరుద్ధరించాలి. ఈ మార్గంలోని అన్ని రైళ్లకు పోచారం, గాంధీపురం, తడికలపూడి, చీమలపాడు, బేతంపూడి స్టేషన్లలో హాల్టింగ్‌ ఇవ్వాలి.

కారేపల్లి – మాదారం, కారేపల్లి – ఇల్లెందు రోడ్‌, ఖమ్మం – ఇల్లెందు రోడ్‌లో గాంధీపురం గేట్ల వద్ద రైల్వే ఓవర్‌ బ్రిడ్జిలు, ధంసలాపురం (అగ్రహారం) వద్ద ఆర్‌యూబీ, ఖమ్మం కస్పాబజార్‌ గేట్‌ వద్ద అండర్‌ పాస్‌ లేదా పాదచారులు, బైక్‌లు వెళ్లేలా రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మించాలి

ఖమ్మం స్టేషన్‌లో అమృత్‌ భారత్‌ పనుల్లో వేగం పెంచడమే కాక భారంగా మారిన పార్కింగ్‌ చార్జీల విషయంలో నెలవారీ పాస్‌లు ప్రవేశపెట్టాలి.

డోర్నకల్‌ – మిర్యాలగూడ లైన్‌ అలైన్‌మెంట్‌ ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లోని సారవంతమైన భూముల నుంచి వెళ్తోంది. దీన్ని డోర్నకల్‌ – వెన్నారం – మన్నెగూడెం – అబ్బాయిపాలెం – మరిపెడ – మోతే మీదుగా పరిశీలించాలి.

మల్లెమడుగు స్టేషన్‌ను ఎత్తివేసే ఆలోచనను వెనక్కి తీసుకోవాలి.

మధిరలో సింహపురి, లక్నో, గౌతమి, పద్మావతి, నవజీవన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు, నాగులవంచలో డోర్నకల్‌–విజయవాడ మెమూ రైలు, ఎర్రుపాలెంలో శాతవాహన, బోనకల్‌లో ఇంటర్‌సిటీ, పద్మావతి, చింతకానిలో కృష్ణా, గోల్కొండకు హాల్టింగ్‌ ఇవ్వాలి. మధిరలో నాలుగో నంబర్‌ ప్లాట్‌ఫామ్‌ నిర్మాణం, దెందుకూరు సమీ పాన రైతుల పట్టా భూముల్లో ఏర్పాటు చేసిన రైల్వే హద్దు రాళ్ల సమస్య పరిష్కరించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement