రోడ్లు దెబ్బతిన్న ప్రాంతాలు..
తిరిగి కాంక్రీట్ చేయక వదిలేస్తున్న వైనం
ఇంకొన్నిచోట్ల మరమ్మతులు లేక.. కొత్త రోడ్లు వేయక ఛిద్రం
అంతర్గత రహదారులే కాక
ప్రధాన రోడ్లదీ అదే పరిస్థితి
ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని అంతర్గత, ప్రధాన రహదారులు అధ్వానంగా మారాయి. కొన్ని రోడ్లు వేసి చాన్నాళ్లు కావడంతో వాహనాల రద్దీతో దెబ్బతిన్నాయి. మరికొన్ని చోట్ల కేబుల్, నీటి పైపు లైన్ల కోసం తవ్వకాలు చేపట్టాక సరిగా కాంక్రీట్ చేయకపోవడంతో గుంతలు పడ్డాయి. వీటిని తాత్కాలిక మరమ్మతులతో సరిపెడుతున్నారే తప్ప కొత్త రోడ్లు వేయకపోవడంతో వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. – సాక్షి ప్రతినిధి, ఖమ్మం
మొత్త రోడ్లు
1,132 కిలోమీటర్లు..
ఖమ్మం నగరంలోని 60 డివిజన్లకు గాను సీసీ, బీటీ, డబ్ల్యూబీఎం (వాటర్ బౌండ్ మకాడమ్), కచ్చా రోడ్లు అన్నీ కలిపి 1,132 కి.మీ. మేర ఉన్నాయి. కార్పొరేషన్ ఏర్పాటు సమయాన విలీన గ్రామాల్లో ఇంకా పాత రోడ్లే దర్శనమిస్తున్నాయి. కొన్ని కాలనీల్లో కొత్తగా రోడ్లు వేస్తున్నా.. పాత రోడ్ల మరమ్మతులను పట్టించుకోవడం లేదు. సీసీ, బీటీ రోడ్లపై ఓ వైపు పగుళ్లు ఏర్పడగా మరో వైపు గుంతలు తేలాయి. ముఖ్య ప్రజాప్రతినిధులు, అధికారుల పర్యటనల సమయాన తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నా కొత్త రోడ్లకు మోక్షం లభించక.. సీసీ రోడ్లు వేయాలని గత కార్పొరేటర్లు చేసిన ప్రతిపాదనలు పెండింగ్‌లోనే ఉన్నాయి.
ప్రధాన రహదారులు
అంతే..
గ్రీన్‌ఫీల్డ్ హైవే తెరవకముందు వరకు ఉమ్మడి జిల్లాతో పాటు సరిహద్దున ఉన్న ఏపీలోని పలు ప్రాంతాలకు వాహనాల రాకపోకలు ఖమ్మం నగరం మీదుగానే సాగాయి. గ్రీన్‌ఫీల్డ్ రహదారి తెరుచుకున్నా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాక వందల సంఖ్యలో వాహనాలు నగరం నుంచే వచ్చివెళ్తున్నాయి. ఇవన్నీ భారీ లోడ్‌తో వెళ్తుండడంతో రోడ్లు చాలాచోట్ల దెబ్బతిన్నాయి.
●పాత బస్టాండ్ నుంచి జెడ్పీసెంటర్ వరకు రహదారి చాలాచోట్ల దెబ్బతిన్నది. రాపర్తినగర్ బైపాస్ రోడ్డు.. కొత్తబస్టాండ్ నుంచి రైల్వే బ్రిడ్జి, మున్నేరు బ్రిడ్జి వరకు పలు చోట్ల గుంతలు ఏర్పడగా నయాబజార్ సర్కిల్ నుంచి ఎఫ్‌సీఐ గోదాం రోడ్డు గుంతలు తేలి దుమ్ము, ధూళితో ఇబ్బంది ఎదురవుతోంది.
కోతకు గురైన అల్లీపురం రహదారి
గట్టయ్య సెంటర్‌లో...
ద్వారకానగర్‌లో...
గుట్టల బజార్‌లో...
ఖమ్మం వన్‌టౌన్ పరిధిలోని బోనకల్ క్రాస్ రోడ్డు, కమాన్‌బజార్, గౌంధీచౌక్, ఖిల్లా రోడ్డు, బ్రాహ్మణ బజార్, పాత బస్టాండ్ ప్రాంతం, పాకబండ బజార్, ముస్తాఫనగర్, అల్లీపురం రోడ్డు
టూటౌన్ ప్రాంతంలోని బస్‌డిపో రోడ్డు, రాపర్తినగర్, సరిత క్లినిక్ రోడ్డు, మామిళ్లగూడెం, మమతా రోడ్డు
త్రీటౌన్‌లోని పీఎస్‌ఆర్ రోడ్డు, శ్రీనివాస్‌నగర్, ప్రకాశ్‌నగర్, కాల్వొడ్డు రోడ్లు
కేబుల్, పైపులైన్ల కోసం
ఇష్టారీతిన తవ్వకాలు


