ఖమ్మంమయూరిసెంటర్: యువశక్తిని జాతీయ నిర్మాణానికి వినియోగించడంతో పాటు విద్యార్థులు, నిరుద్యోగుల హక్కుల సాధన, ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాడడమే యువజన కాంగ్రెస్ లక్ష్యమని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ తెలిపారు. ఖమ్మంలోని కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో ఆదివారం యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సత్యనారాయణ, రాయల నాగేశ్వరరావు జెండా ఆవిష్కరించారు. అనంతరం నూతి మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, నిరసించడం, న్యాయం కోరడం యువత హక్కులని తెలిపారు. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యువత గొంతుకను అణచివేసే కుట్రలు చేస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం పేదలకు అన్నదానం చేశారు. నాయకులు వేజండ్ల సాయికుమార్, బాలాజీనాయక్, కొత్త సీతారాములు, శేఖర్‌గౌడ్, బొడ్డు బొందయ్య, సయ్యద్ గౌస్, అనిల్, గంగరాజు, షాహెల జావిద్ తదితరులు పాల్గొన్నారు.
డీసీసీ అధ్యక్షుడు సత్యనారాయణ


