ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆషాఢ మాసం ఆదివారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి, అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేయడమే కాక అలివేలు మంగ అమ్మవారికి సర్పంచ్ తుళ్లూరి నిర్మలకుమారి–కోటేశ్వరరావు దంపతులు బోనాలు, సారె సమర్పించారు. అలాగే, అర్చకులు ఆలయ ఆవరణలోని శ్రీవారి పాదం, స్వామి మూలవిరాట్‌కు అభిషేకం, స్వామి నిత్యకల్యాణం, పల్లకీసేవ నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, జూనియర్ అసిస్టెంట్ కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
పీజీలో నాలుగు
కొత్త కోర్సులు
రేక్ పాయింట్‌కు చేరిన కాంప్లెక్స్ ఎరువులు
చింతకాని: మండలంలోని పందిళ్లపల్లి రేక్ పాయింట్‌కు ఆదివారం కాంప్లెక్స్ ఎరువులు చేరాయి. ఇందులో డీఏపీ 394.800 మెట్రిక్ టన్నులు, 20.20.0.13 ఎరువులు 723.250 మె.టన్నులతో పాటు ఎంఓపీ 255.200 మె. టన్నులు ఉన్నాయని జిల్లా వ్యవసాయ శాఖా ధికారి డి.పుల్లయ్య వెల్లడించారు. ఈ ఎరువుల ను మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు సరఫరా చేసినట్లు తెలిపారు.
ప్రత్యేక బెటాలియన్‌లో అదనపు డీజీపీ
సత్తుపల్లి: సత్తుపల్లి మండలం గంగారంలోని 15వ ప్రత్యేక బెటాలియన్‌ను అదనపు డీజీపీ సంజయ్‌కుమార్ జైన్ ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏకలవ్యుడి విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన బెటాలియన్‌లోని ఎంటీ గ్యారేజ్, ఆడిటోరియం, బీటీసీ ట్రైనింగ్ సెంటర్, ప్రధాన కార్యాలయం, క్వార్టర్లు, ఫైరింగ్ రేంజ్‌లను పరిశీలించి నిర్వహణపై అధికారులకు సూచనలు చేశారు. ఈకార్యక్రమంలో కమాండెంట్ ఎన్.పెద్దబాబు, వివిధ విభాగాల అధికారులు ఏ.అంజయ్య, బి.వేణుగోపాల్‌రెడ్డి, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్సైలు పాల్గొన్నారు.
వరుణ యాగానికి
భద్రగిరి వేదపండితులు
భద్రాచలంటౌన్: రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ ధర్మాదాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లో సోమవారం నిర్వహించనున్న వరుణ యాగం కార్యక్రమానికి భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి చెందిన ముఖ్య వైదిక సిబ్బంది, వేదపండితుల బృందం ఆదివారం ప్రత్యేక వాహనంలో బయలుదేరి వెళ్లింది. రాష్ట్రవ్యాప్తంగా సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, జలాశయాలన్నీ నిండాలని, తద్వారా పాడిపంటలు వర్ధిల్లి రైతాంగం సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రభుత్వం ఈ మహా యాగాన్ని తలపెట్టింది. హోమాలు, పూజా కార్యక్రమాల్లో భద్రాద్రి రామాలయ అర్చక స్వాములు కీలక పాత్ర పోషించనున్నారు. వేద పారాయణం నిర్వహించేందుకు ఆలయ ప్రధాన అర్చకులు, స్థానాచార్యులు, ఉప ప్రధాన అర్చకులతో కూడిన వేదపండితుల బృందం బయలుదేరింది.


