కోళ్ల పరిశ్రమలపై దాణా ధరల భారం
ఉత్పత్తి ఖర్చు పెరగడంతో
చికెన్ ధరలు ౖపైపెకి..
దాణా ధరలు పెరుగుదల (కిలోకు రూ.ల్లో)
భారంగా చికెన్..
ఉత్పత్తి ఖర్చు పెరిగింది
ధరల మంట..
ఖమ్మంవ్యవసాయం: కోళ్ల దాణా ధరలు మండి పోతున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న దాణా ఖర్చులతో కోళ్ల పెంపకంపై భారం పడుతోంది. పెరిగిన ఉత్పత్తి ఖర్చు భారం చికెన్ ప్రియులే భరించక తప్పటం లేదు. ప్రస్తుతం మార్కెట్‌లో చికెన్ ధర రూ.320 వరకు చేరడంతో సామాన్యులు మొద లు మధ్య తరగతి కుటుంబాలకు భారమైంది.
పెరిగిన దాణా ధరలు
దాణా ధరలు కొద్ది రోజుల వ్యవధిలో 25 – 75 శాతం వరకు పెరిగాయి. ఈ ప్రభావంతో ధర 40 శాతం మేర పెరిగింది. రెండు నెలలుగా మొక్కజొన్న, సోయా, బియ్యం తవుడు ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో కోళ్ల పరిశ్రమ ఒత్తిడికి గురవుతూ.. పౌల్ట్రీ రైతులకు గిట్టుబాటు కావడం లేదు. ఒక కోడిని పెంచేందుకు గతంలో రూ.70 – రూ.80వరకు ఖర్చయితే ఇప్పుడు అది రూ.100కు చేరింది.
ఉత్పత్తి తగ్గించిన రైతులు
దాణా ఖర్చు పెరగడంతో నిర్వహణ భారం భరించలేక పౌల్ట్రీ రైతులు కోళ్ల ఉత్పత్తి తగ్గించారు. మరోపక్క ఇటీవల ఏసీ పౌల్ట్రీలు పెరుగుతున్నాయి. వీటిలో తక్కువ ఖర్చు, తక్కువ వ్యవధిలోనే కోడి సిద్ధమవుతోంది. వీటితో పోలిస్తే సాధారణ ఫారాల్లో కోళ్ల ఉత్పత్తి ధర ఎక్కువగా ఉండడం నిర్వాహకులపై భారం పడుతోంది. దీనికి తోడు ఇప్పుడు దాణా ధరలు పెరగడంతో కోళ్ల ఉత్పత్తి తగ్గిస్తున్నారు. జిల్లాలో 25 – 30 వరకు పెద్ద పౌల్ట్రీ ఫారాలు ఉండగా, చిన్న పరిశ్రమలు వందల సంఖ్యలో కొనసాగుతున్నాయి.
చికెన్ ప్రియులపై భారం
పెరిగిన చికెన్ ధరలు వినియోగదారులకు భారంగా మారుతున్నాయి. కరోనా తర్వాత చికెన్‌కు ప్రాధాన్యత పెరిగింది. ప్రోటీన్లు ఉండే ఆహారం కావడం.. మటన్ ధర రూ.వేయి దాటడంతో చాలామంది చికెన్ వైపు మొగ్గు చూపుతున్నారు. సామాన్యులు మొదలు మధ్య తరగతి, ఉన్నత స్థాయి వర్గాలు వారానికి ఒకసారి చికెన్ తింటున్నారని అంచనా. గతంలో కిలో రూ.200 వరకు ఉన్న చికెన్ ధర ప్రస్తుతం ప్రాంతాల వారీగా రూ.300 నుంచి రూ.320 పలుకుతుండడం సామాన్య, మధ్య తరగతి వారిపై భారమవుతోంది.
ప్రస్తుత ధర
గత ధర
దాణా రకం
పెరుగుదల
రూ.160 నుంచి రూ.200 ఉన్న కిలో చికెన్ ఇప్పుడు రూ.320కి విక్రయిస్తున్నారు. ఈ ధరతో వారానికి ఒకసారి కొనుగోలు చేయడం భారంగా ఉంది. ప్రొటీన్ ఫుడ్‌గా చికెన్‌కు ప్రాధాన్యత ఇస్తున్నా ధరల పెరుగుదల ఇబ్బందికరంగా మారింది.
–సోమారపు సుధీర్, ప్రకాష్‌నగర్, ఖమ్మం
దాణాలో మొక్కజొన్నతో పాటు సోయా, బియ్యం తవుడు ధరలు పెరిగి కోడి ఉత్పత్తి ఖర్చు బాగా పెరిగింది. రూ.80 మేర విక్రయించాల్సిన లైవ్ కోడిని రూ.130తో అమ్మినా ప్రయోజనం ఉండడం లేదు. ఫారాల నిర్వహణ ఆశానకంగా లేదు.
–రావి బాబూరావు, శ్రీనివాసనగర్, ఖమ్మం


