ఖమ్మంసహకారనగర్: ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు వరంగల్, నల్లగొండ జిల్లాల నుంచి పోలీస్, గ్రూప్స్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఏడాది పాటు ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ ఇవ్వనున్నట్లు ఆర్‌సీ ఎగ్జామ్స్ చైర్మన్ మెండెం కిరణ్‌కుమార్ తెలిపారు. పోస్టర్లను ఆదివారం మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జ్ తుంబూరు దయాకర్‌రెడ్డి ఆవిష్కరించగా కిరణ్‌కుమార్ మాట్లాడారు. రాష్ట్రంలోనే పేరున్న కరీం, కృష్ణారెడ్డి, పాషా తదితర అనుభవజ్ఞులైన అధ్యాపకులతో ఆన్‌లైన్ కోచింగ్ ఇప్పిస్తామని తెలిపారు. ఇందుకోసం అభ్యర్థులు kiranyuvasena. comలో వివరాలు నమోదు చేసుకోవాలని, వివరాలకు 83990 99499 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.


