స్టీల్‌ బల్లల కోసం రూ.1,00,116 విరాళం | - | Sakshi
Sakshi News home page

స్టీల్‌ బల్లల కోసం రూ.1,00,116 విరాళం

Aug 10 2026 12:22 AM | Updated on Aug 10 2026 12:22 AM

ఖమ్మంఅర్బన్‌: ఖమ్మం యూపీహెచ్‌ కాలనీలోని శ్రీస్వయంభూ వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో వసతుల కల్పనకు గోకుల్‌ ఏజెన్సీ అధినేత చంద్రకాని శేషగిరిరావు, ఆయన కుమారులు రమేశ్‌, రంజిత్‌ రూ.1,00,116 విరాళం అందజేశారు. ఈ నగదుతో ఆలయ అన్నదానం క్యూలైన్‌లో భక్తులు కూర్చునేలా స్టీల్‌ బల్లలు తయారీ చేయించాలని ఆలయ నిర్వాహకులను కోరారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్‌ అల్లిక అంజయ్య తదితరులు దాతలను అభినందించారు.

నేటి జైల్‌ భరోను

జయప్రదం చేయండి

ఖమ్మంమయూరిసెంటర్‌: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సోమవారం తలపెట్టిన జైల్‌భరోను జయప్రదం చేయాలని తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌(టీయూసీఐ అనుబంధం) రాష్ట్ర కార్యదర్శి జి.రామయ్య పిలుపునిచ్చారు. ఖమ్మం రామనరసయ్య విజ్ఞాన కేంద్రంలో నగర ఉపాధ్యక్షుడు కిన్నెర నారాయణ అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సోమవారం ఖమ్మం జెడ్పీ సెంటర్‌ నుంచి టూ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ వరకు నిర్వహించే ర్యాలీలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. నాయకులు డి.గురవయ్య, బాబు, శ్రీను, సుధాకర్‌, నాగరాజు, యుగంధర్‌, సరస్వతి, సత్యవతి, లక్ష్మి, మోహన్‌, దేవా, ధర్మయ్య, అనిల్‌, నరసయ్య పాల్గొన్నారు.

పీఆర్సీ ప్రకటించి

పదోన్నతులు కల్పించాలి

ఖమ్మంసహకారనగర్‌: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించా లని టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు. ఖమ్మంలోని యూనియన్‌ కార్యాలయంలో జిల్లా అధ్య క్షుడు షేక్‌ రంజాన్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి సర్వీస్‌ రూల్స్‌ సమస్యను పరిష్కరించి ఎంఈఓ, జేఎల్‌, డైట్‌, బీఈడీ కాలేజీల్లోని ఖాళీ పోస్టు లను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలన్నారు. అంతేకాక కాంగ్రెస్‌ ఎన్నికల వేళ ఇచ్చి న హామీ మేరకు పీఆర్సీ అమలు, పెండింగ్‌ డీఏల విడుదల, పెండింగ్‌ బిల్లుల చెల్లింపు, పాత పింఛన్‌ విధానం పునరుద్ధరణపై స్పందించాలని డిమాండ్‌ చేశారు. అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లయినా సమస్యల పరిష్కా రంపై ప్రభుత్వం ఉదాసీన వైఖరిని నిరసిస్తూ ఈ నెల 12,13 తేదీల్లో తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట నిరసన తెలిపి, ప్రభుత్వం స్పందించకపోతే 19న కలెక్టరేట్ల వద్ద నిరసనలు, 29న చలో హైదరాబాద్‌ నిర్వహిస్తామని హెచ్చరించారు. ఇంకా ఈ సమావేశంలో నాయకులు బుర్రి వెంక న్న, షమీ, వల్లంకొండ రాంబాబు, బానోత్‌ రాందాస్‌, సురేశ్‌, ఉద్దండ్‌, నాగేశ్వరరావు, నర్సయ్య, పద్మ, నిర్మలాకుమారి, రామారావు, నాగూర్‌వలీ, సుధాకర్‌, ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.

పేకాటరాయుళ్ల అరెస్టు

రెండు చోట్ల రూ.32,500

నగదు స్వాధీనం

ఎర్రుపాలెం/తల్లాడ: ఎర్రుపాలెం మండలంలోని సఖినవీడు సమీపాన పేకాట కేంద్రంపై ఆదివారం పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న తొమ్మిది మందిని అదుపులోకి తీసుకుని ఐదు మోటారు సైకిళ్లు, రూ.23,800 నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ఎం.రమేశ్‌కుమార్‌ తెలిపారు. అలాగే, తల్లాడలోని గొల్లగూడెం వెళ్లే రహదారిలో గుంటు చెరువు సమీపాన ఎస్‌ఐ వెంకటకృష్ణ, సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతూ పది మంది పట్టుబడగా, రూ.8,700 నగదు, ఏడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

పోక్సో కేసులో

నిందితుడి రిమాండ్‌

వైరా: మైనర్‌ బాలికతో మద్యం మత్తులో శనివారం రాత్రి అసభ్యకరంగా ప్రవర్తించిన వైరా వాసి గౌరవరపు డేవిడ్‌ అలియాస్‌ జగదీశ్‌పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేసిన విషయం విదితమే. ఈ మేరకు ఆయనను మధిర కోర్టు జడ్జి ఎదుట హాజరుపరిచారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement