గరిష్టం / కనిష్టం
340 / 240
వాతావరణ ం
జిల్లాలో సోమవారం సాధారణ ఉష్ణోగ్రతలే ఉంటాయి. మధ్యాహ్నం ఎండ పెరిగినా సాయంత్రం తర్వాత చల్లబడుతుంది.
ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని శాకంబరి అలంకరణలో పెద్దమ్మతల్లి, శాకంబరేశ్వరుడి అలంకరణలో శ్రీ కాశీవిశ్వేశ్వర స్వామి భక్తులకు దర్శనం ఇచ్చారు. భక్తులు వితరణ చేసిన కూరగాయలు, పండ్లు, పూలతో ఆదివారం పాల్వంచ మండలంలోని శ్రీ కనకదుర్గ (పెద్దమ్మతల్లి) అమ్మవారిని అలంకరించారు. ఈ అవతారంలో అమ్మవారిని దర్శించుకునేందుకు ఉమ్మడి జిల్లా నుంచే కాక రాష్ట్రంలోని పలు ప్రాంతాల భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. అర్చకులు అమ్మవారికి విశేష పూజలు చేయగా, భక్తులు ఒడి బియ్యం, పసుపు కుంకుమ, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పూజల్లో ఈఓ విజయ్‌కుమార్, అర్చకులు పద్మనాభశర్మ, రవికుమార్‌శర్మ పాల్గొన్నారు.
– పాల్వంచరూరల్


