ఖమ్మంమయూరిసెంటర్: ఏఐసీసీ సంఘటన్, సృజన్, అభియాన్ ప్రక్రియలో భాగంగా మండల, గ్రామ కమిటీలను నియమించేందుకు ఇన్‌చార్జిలను నియమించినట్లు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణగౌడ్ తెలిపారు. ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ ఆదేశాలతో ఈ నెల 15 లోపు మండల, గ్రామ కమిటీలను నియమించాల్సి ఉందని తెలిపారు. ఇందుకోసం మండల అధ్యక్షులతో సమన్వయం చేసుకునేలా ఇన్‌చార్జ్‌లను నియమించామని చెప్పారు. సమావేశంలో నాయకులు పులిపాటి వెంకయ్య, బానోత్ బాలాజీ నాయక్, గజ్జెల్లి వెంకన్న, తూములూరి లక్ష్మీనరసింహారావు, కిలారు అనిల్‌కుమార్, రామసహాయం హరితరెడ్డి, కమటాల రేణుక, బచ్చలకూర నాగరాజు, మూడుముంతల గంగరాజుయాదవ్, కొట్టెట్టే రాజశేఖర్, కంచర్ల వెంకటనర్సయ్య, పులిబండ్ల చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు మండలాల వారీగా ఇన్‌చార్జ్‌లను డీసీసీ అధ్యక్షుడు ప్రకటించారు. రఘునాథపాలెం మండలానికి ఫతే మహమ్మద్, ఖమ్మం రూరల్‌కు గజ్జెల వెంకన్న, తిరుమలాయపాలెంకు హరితరెడ్డి, కూసుమంచికి తూములూరి లక్ష్మీనర్సింహారావు, నేలకొండపల్లికి బమ్మిడి శ్రీనివాసరావు, ముదిగొండకు బచ్చలకూర నాగరాజు, చింతకాని ఎస్.కే.మస్తాన్, బోనకల్‌కు దామా స్వరూప, మధిరకు వెంకటనర్సయ్య, ఎర్రుపాలెంకు చిట్టిబాబును ఇన్‌చార్జ్‌గా నియమించినట్లు తెలిపారు. అలాగే, సింగరేణి మండలానికి ప్రభావతిరెడ్డి, ఏన్కూరుకు కమటాల రేణుక, కొణిజర్లకు బాలాజీనాయక్, వైరాకు మద్దినేని రమేశ్, తల్లాడకు ఎం.నాగరాజు, కల్లూరుకు పొట్లపల్లి వెంకటేశ్వర్లు, పెనుబల్లికి ఎస్.బ్రహ్మారెడ్డి, సత్తుపల్లికి సోమిరెడ్డి, వేంసూరుకు గంగిశెట్టి ప్రసాద్, కామేపల్లికి కొట్టే రాజశేఖర్ ఇన్‌చార్జ్‌గా నియమితులయ్యారు. ఇక మున్సిపాలిటీల్లో ఏదులాపురానికి కె.వెంకటరమణ, మధిరకు జి.ఝాన్సీ, వైరాకు మద్దినేని రమేష్, కల్లూరుకు కోసూరి వెంకటేశ్వర్లు, సత్తుపల్లికి యర్రం సత్యనారాయణను ఇన్‌చార్జ్‌గా నియమించారు.
మండల అధ్యక్షులు, ఇన్‌చార్జ్‌ల
నేతృత్వాన పర్యవేక్షణ


