వచ్చినప్పుడు ఇస్తాం! | - | Sakshi
Sakshi News home page

వచ్చినప్పుడు ఇస్తాం!

Aug 5 2026 12:12 AM | Updated on Aug 5 2026 12:12 AM

జిల్లాలో అన్ని షాప్‌లకు

బియ్యం చేరక ఇక్కట్లు

స్టాక్‌ లేక వెనుదిరుగుతున్న

లబ్ధిదారులు

స్టాక్‌ లేదన్నారు..

షాపుల్లో నిల్వలు ఉన్నాయి..

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యాన కేంద్ర ప్రభుత్వం మూడు నెలల రేషన్‌ బియ్యాన్ని ఈ నెలలోనే పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆగస్టు, సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల బియ్యం పంపిణీ చేయాల్సి ఉంది. ప్రతీనెల తొలి 15 రోజులు మాత్రమే బియ్యం పంపిణీ చేస్తుండగా, మూడు నెలల బియ్యం కావడంతో నెలాఖరు వరకు పంపిణీ చేస్తామని ప్రకటించారు. ఇంతవరకు బాగానే ఉన్నా జిల్లాలోని 748 రేషన్‌ దుకాణాలకు గాను ఇప్పటి వరకు కేవలం 443 షాప్‌లకే బియ్యం చేరింది. మిగతా 305 దుకాణాలకు రాకపోగా, లబ్ధిదారులు ప్రతీరోజు షాప్‌ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

7,259 మెట్రిక్‌ టన్నులే..

మూడు నెలల రేషన్‌ పంపిణీ ఈనెల 1నుంచి అధికారికంగా ప్రారంభమైంది. జిల్లాలో 4,73,271 రేషన్‌కార్డులపై ఉన్న లబ్ధిదారులకు మూడు నెలల కోటా పంపిణీ చేయాలంటే 24,359.342 మెట్రిక్‌ టన్నుల బియ్యం అవసరమవుతాయి. అయితే, ఇప్పటివరకు జిల్లాలోని 443షాప్‌లకు కేవలం 7,259.981 మె.టన్నుల బియ్యమే చేరింది. ఇది మొత్తం బియ్యంలో 29.80 శాతం కాగా, కనీసం సగం బియ్యమైనా అన్ని షాపులకు చేరితే లబ్ధిదారుల కు పంపిణీ సాగేది. కానీ 305షాప్‌లకు 17,099.361 మె.టన్నుల బియ్యం ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి చేరకపోవడంతో సమస్య ఎదురవుతోంది.

ముందే క్యూ కడుతూ..

మూడు నెలల బియ్యం ఒకేసారి ఇస్తుండడంతో లబ్ధిదారులు మూడు సార్లు వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. దీంతో ఆలస్యం అవుతుందనే భావనతో లబ్ధిదారులు చౌక ధరల దుకాణాల వద్ద ఉదయం నుంచే క్యూ కడుతున్నారు. అయితే 70 శాతం షాపులకు ఇంకా బియ్యమే చేరకపోవడంతో పంపిణీ అంతంత మాత్రంగానే సాగుతోంది. మిగతా షాప్‌లకు సైతం పూర్తిస్థాయిలో బియ్యం రాక ఆ దుకాణాల వద్ద రద్దీ ఉంటోంది. మిగతా షాపుల వద్ద లబ్ధిదారులు ఆరా తీస్తుండగా ‘స్టాక్‌ రాలేదు.. బియ్యం వస్తే ఇస్తాం’ అని డీలర్లు చెబుతున్నారు. ఇంకొందరు మాత్రం స్టాక్‌ లేదని బోర్డు ఏర్పాటుచేసి షాప్‌లు మూసేశారు.

శాతం

సరఫరా అయిన బియ్యం

దుకాణాలకు

అందాల్సిన

బియ్యం

7,259.981 మె.టన్నులు

29.80

17,099.361 మె.టన్నులు

బియ్యం చేరాల్సిన దుకాణాలు

305

748

జిల్లాలో మొత్తం

రేషన్‌షాప్‌లు

4,73,271

24,359.342 మె.టన్నులు

రేషన్‌కార్డులు

మూడు నెలలకు అవసరమైన బియ్యం

ఇప్పటి వరకు

సరఫరా అయిన షాప్‌లు

మూడు నెలల బియ్యం

ఒకేసారి పంపిణీకి

ప్రభుత్వం నిర్ణయం

బియ్యం కోసం వస్తే స్టాక్‌ లేవన్నారు. కూలీ పనికి వెళ్లొచ్చే సరికి స్టాక్‌ అయిపోవడంతో మళ్లీమళ్లీ తిరగడం ఇబ్బందిగా ఉంది. బియ్యం ఎప్పుడు వస్తాయో డీలర్లు సరిగ్గా చెప్పడం లేదు. అన్ని షాప్‌లకు బియ్యం కేటాయిస్తే బాగుంటుంది.

– జి.కృష్ణ, యూపీహెచ్‌ కాలనీ, ఖమ్మం

రేషన్‌ దుకాణాల్లో బియ్యం నిల్వలు ఉన్నాయి. గత నెలలో మిగిలిన బియ్యాన్నీ పంపిణీ చేయాలని డీలర్లకు సూచించాం. దుకాణాల్లో నిల్వ సామర్థ్యానికి అనుగుణంగా చేరవేస్తున్నాం. జిల్లాలో జీరో స్టాక్‌ ఉన్న షాపులు ఎక్కడా లేవు.

– మల్లికార్జున్‌బాబు, ఇన్‌చార్జి మేనేజర్‌,

పౌర సరఫరాల సంస్థ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement