మక్కలకు యమ డిమాండ్‌! | - | Sakshi
Sakshi News home page

మక్కలకు యమ డిమాండ్‌!

Aug 5 2026 12:12 AM | Updated on Aug 5 2026 12:12 AM

ఖమ్మంవ్యవసాయం: ‘ఎల్‌నినో’ నేపథ్యాన మక్కలకు డిమాండ్‌కు పెరిగింది. పౌల్ట్రీ పరిశ్రమలు, ఇంధన(ఇథనాల్‌) కంపెనీలు ఆసక్తి చూపడంతో మార్క్‌ఫెడ్‌ ద్వారా వేలంలో మెరుగైన ధర పలికింది. గత యాసంగి సీజన్‌లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర రూ.2,400 కన్నా తక్కువ ధర పలుకుతుండడంతో రైతులు నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3.31 లక్షల మెట్రిక్‌ టన్నులను రూ.795 కోట్లను వెచ్చించి కొనుగోలు చేయగా, దాదాపు 50 వేల మె.టన్నులను ఓపెన్‌ షెడ్లలో, మిగిలిన పంట క్లోజ్డ్‌ షెడ్లలో నిల్వ చేశారు. తొలుత ఓపెన్‌ షెడ్లలో మక్కలకు రక్షణ లేకపోవడంతో టెండర్లు నిర్వహించగా క్వింటాకు రూ. 2,200 ధరే పలకడంతో నష్టం ఎదురైంది. ఆతర్వాత క్లోజ్డ్‌ షెడ్లలో ఉన్న మక్కల అమ్మకానికి ఈ–వేలం వేయగా క్వింటాకు రూ.2,490 నుంచి రూ.2,560 ధర పలికింది. ఫలితంగా మార్క్‌ఫెడ్‌ కొనుగోలు చేసిన దాని కంటే అధిక ధర వచ్చినట్లయింది. ఓపెన్‌ షెడ్లలో ఉన్న మక్కలను తొలుత పంపిస్తుండగా, ఆ తర్వాత మిగతా సరుకు పంపిస్తామని మార్క్‌ఫెడ్‌ ఉమ్మడి జిల్లా మేనేజర్‌ బత్తుల నరసింహారావు తెలిపారు.

కొన్న ధర కంటే వేలంలో అధికం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement