కార్గిల్‌ అమరుల త్యాగాలు మరువలేనివి | - | Sakshi
Sakshi News home page

కార్గిల్‌ అమరుల త్యాగాలు మరువలేనివి

Jul 27 2026 12:24 AM | Updated on Jul 27 2026 12:24 AM

ఖమ్మం రాపర్తినగర్‌: కార్గిల్‌ యుద్ధంలో భారత సైనికులు చేసిన పోరాట పటిమ మరువలేనిదని ఇంటెలిజెన్స్‌ విభాగం ఉమ్మడి జిల్లా ఎస్పీ రామోజీ రమేష్‌ అన్నారు. ఖమ్మంలోని ఫ్రీడమ్‌ పార్కులో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరులను స్మరించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. వీరి పోరాట పటిమ, త్యాగాలు అందరికీ స్ఫూర్తిగా నిలుస్తాయని చెప్పారు. అనంతరం కార్గిల్‌ విజయ దివస్‌ను పురస్కరించుకుని మాజీ సైనిక ఉద్యోగులను సన్మానించారు. ఈకార్యక్రమంలో జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి చంద్రశేఖర్‌, మాజీ సైనిక ఉద్యోగుల అసోసియేషన్‌ బాధ్యులు గోపాల్‌రావు, సుభానీ, ఎస్‌.ఎం.అరుణ్‌కుమార్‌, కోటపాటి రుక్మారావు, హనుమంతరావు, ఎస్‌.రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement