రేక్‌ పాయింట్‌కు 1,301 మె.టన్నుల యూరియా | - | Sakshi
Sakshi News home page

రేక్‌ పాయింట్‌కు 1,301 మె.టన్నుల యూరియా

Jul 27 2026 12:24 AM | Updated on Jul 27 2026 12:24 AM

ఖమ్మం సహకారనగర్‌: కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యాన బీడీ, సినీ, గని కార్మికుల పిల్లలకు ఇచ్చే స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి జి.సదానందం తెలిపారు. ఒకటి నుండి పదో తరగతి విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందనుండగా, ఆగస్టు 31వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ, ఎయిడెడ్‌, గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదువుతున్న బీడీ, సినీ, గని కార్మికుల పిల్లలంతా అర్హులేనని తెలిపారు. గతంలో స్కాలర్‌షిప్‌ పొందిన విద్యార్థులు కూడా ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి రెన్యూవల్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ ఓ ప్రకటనలో సూచించారు.

చింతకాని: చింతకాని మండలం పందిళ్లపల్లిలోని రేక్‌ పాయింట్‌కు ఆదివారం యూరియా చేరింది. స్పిక్‌ కంపెనీకి చెందిన యూరియా 603 మెట్రిక్‌ టన్నులు, 20.20.00.13 ఎరువు 510 మె.టన్నులు, 17.17.17 ఎరువు 125.05 మె.టన్నులతో పాటు ఎస్‌ఎస్‌పీ–జీ ఎరువు 63.80 మె. టన్నులు ఇందులో ఉంది. ఈ యూరియాను ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌ జిల్లాకు ఇండెంట్‌ ఆధారంగా పంపిణీ చేసినట్లు డీఏఓ ధనసరి పుల్లయ్య వెల్లడించారు.

టీజీసీజీటీఏ

జిల్లా కమిటీ ఎన్నిక

అధ్యక్ష, కార్యదర్శులుగా విజయ్‌, రాంబాబు

ఖమ్మం సహకారనగర్‌: తెలంగాణ గవర్నమెంట్‌ కాలేజీ గెజిటెడ్‌ టీచర్స్‌ అసోసియేషన్‌(టీజీసీజీటీఏ) జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ ఎన్నిక ఖమ్మంలోని ఎస్‌ఆర్‌ అండ్‌ బీజీఎన్‌ఆర్‌ డిగ్రీ కళాశాలలో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడిగా ఈ.విజయ్‌కుమార్‌, కార్యదర్శిగా సూరంపల్లి రాంబాబు, కోశాధికారిగా శ్యామలాదేవి, ఉపాధ్యక్షుడిగా కార్తీక్‌తో పాటు ఇతర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అనంతరం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్‌ ఎన్‌.గోపీ, డాక్టర్‌ కె.సురేందర్‌రెడ్డితో పాటు డాక్టర్‌ ఎం.మాధవరావు, డాక్టర్‌ పి.రవికుమార్‌ వీరిని అభినందించారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై న రాంబాబు మాట్లాడుతూ ఉద్యోగుల హక్కులకు భంగం కలగకుండా కృషి చేస్తామని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో కె.కిరణ్‌ కుమార్‌, బూరుగు శ్రీనివాస్‌, జి.గుప్తా, సీహెచ్‌.శ్రీనివాస్‌, బి.బ్రహ్మం, ఐ.కిరణ్‌ కుమార్‌, మల్లేశం, డి.సుజాత, బాబు, జి.అరుణ పాల్గొన్నారు.

పోతురాజుకు

బాలసాహిత్య పురస్కారం

సత్తుపల్లిటౌన్‌: హైదరాబాద్‌ రవీంద్రభారతిలో ఆదివారం జరిగిన తెలుగు సాహితీ వనం తొమ్మిదో వార్షికోత్సవంలో సత్తుపల్లికి చెందిన బాల రచయిత ఆవుల పోతురాజు స్నిగ్దారెడ్డి బాలసాహిత్య పురస్కారాన్ని అందుకున్నాడు. తెలుగు సాహితీ వనం నిర్వాహకులు శాంతికృష్ణ అధ్యక్షతన జరిగిన సాహితీ వేత్తలు డాక్టర్‌ ఏనుగు నర్సింహారెడ్డి, డాక్టర్‌ అంపశయ్య నవీన్‌, డాక్టర్‌ పెద్దింటి అశోక్‌కుమార్‌ తదితరులు ఆయనకు అవార్డు అందజేసి మాట్లాడారు. పేద కుటుంబంలో జన్మించి చదువుకుంటూనే బాల రచయితగా రాణిస్తున్న పోతురాజును అభినందించి చదువు నిమిత్తం రూ.12వేల ఆర్థిక సాయం అందచేశారు. కాగా, పోతురాజుతో పాటు ఆయనను ప్రోత్సహించిన ఉపాధ్యాయిని రమాదేవి వెంకటాచార్యులును ఎమ్మెల్యే డాక్టర్‌ మట్టా రాగమయి, ఆషా స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్‌ డాక్టర్‌ దయానంద్‌, వివిధ సంస్థల బాధ్యులు రామకృష్ణ, మధుసూదన్‌రాజు, గట్టే వాసు, ఆడమ్స్‌, నాగేశ్వరరావు, అయ్యదేవర శేషగిరిరావు, మాదిరాజు మాలతి, కేశవరెడ్డి, ప్రకాశరావు, రామిశెట్టి సుబ్బారావు, డి.కృష్ణయ్య, నర్సయ్య, బూరుగు దాసు అభినందించారు.

స్కాలర్‌షిప్‌లకు

దరఖాస్తుల ఆహ్వానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement