ఖమ్మంమయూరిసెంటర్: మహిళా సంఘాల సభ్యులు తమ సమావేశాల్లో పొదుపు, రుణ వసూళ్లతో పాటు సమాజంలోని సామాజిక సమస్యలపై కూడా చర్చించాలని, దీనిని అజెండాగా మినిట్స్‌లో రాసుకోవాలని అడిషనల్ డీఆర్‌డీఓ జయశ్రీ సూచించారు. ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని సెర్ప్ – ప్రజ్వల్ స్వచ్ఛంద సేవాసంస్థ ఆధ్వర్యాన జిల్లా సమాఖ్య భవనంలో వీఓఏలు, మండల ఓబీలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జయశ్రీ మాట్లాడుతూ పిల్లల ప్రవర్తనలో మార్పులను తల్లిదండ్రులు గమనించాలని తెలిపారు. మానవ అక్రమ రవాణాను కొందరు వ్యాపారంగా మార్చుకోగా, తల్లిదండ్రుల ఆదరణ లేక, ఆర్థిక పరిస్థితులు సరిగా లేని వారు బాధితులుగా మారుతున్నారని చెప్పారు. గ్రామాల్లో ఇలాంటి అంశాలను గుర్తిస్తే సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు. అంతేకాక సభ్యులు 100, 112, 108, 1098, 181, 1930 నంబర్లపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఆతర్వాత బాల్య వివాహాలు, మత్తు పదార్థాల కట్టడి, మానవ అక్రమ రవాణాపై విస్తృత ప్రచారం చేస్తున్న పాఠశాలలు, అంగన్‌వాడీ టీచర్లను సత్కరించారు. ఈ కార్యక్రమంలో డీపీఎం ఆంజనేయులు, జిల్లా సమాఖ్య కార్యదర్శి విజయలక్ష్మి, ప్రజ్వల ఎన్‌జీఓ కోఆర్డినేటర్ సురేష్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.
అడిషనల్ డీఆర్‌డీఓ జయశ్రీ


