సత్తుపల్లిటౌన్: రాష్ట్రానికి ఉన్న గొప్ప చారిత్రక వారసత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పౌరులపై ఉందని తెలంగాణ పురావస్తు, మ్యూజియం శాఖ డైరెక్టర్ ప్రొఫెసర్ అర్జున్‌రావు అన్నారు. సత్తుపల్లిలోని జేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు పురావస్తు సంపదను పరిరక్షించడమే కాక చారిత్రక ప్రదేశాల పట్ల గౌరవం కలిగి ఉండాలని సూచించారు. ఈ విషయమై ఇంకొందరికి అవగాహన కల్పించాలని తెలిపారు. ఈసమావేశంలో ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్ గోపి, అధ్యాపకులు విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.


