ఖమ్మంరూరల్: మండలంలోని పొన్నేకల్‌కు చెందిన పి.లింగరాజు ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన 22 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలోని లబ్ధిదారుల నుంచి బియ్యం కొనుగోలు చేసి బయట ఎక్కువ ధరకు అమ్మేందుకు సిద్ధమైనట్లు సమాచారంతో సివిల్ సప్లయీస్ డీటీ విజయ్‌బాబు ఆధ్వర్యాన గురువారం తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా 22 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకోగా, లింగరాజుపై 6ఏ కేసు నమోదు చేసినట్లు డీటీ తెలిపారు.
ఈదురుగాలులకు
ఎగిరిపడిన రేకులు
వైరారూరల్: వైరా మండలంలో బుధవారం రాత్రి వీచిన ఈదురుగాలులకు స్నానాల లక్ష్మీపురం శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద స్నాన ఘట్టాలపై రేకులు ఎగిరిపడ్డాయి. గత ఏడాది మహా శివరాత్రి సమయాన స్నానాల ఘట్టాలను రేకుల కప్పుతో నిర్మించారు. ఒకరోజు ఈదురుగాలులకే ఇవి ఎగిరిపడడంతో నాణ్యతపై పలువురు విమర్శిస్తున్నారు.


