మోతె: కాలకృత్యాలు తీర్చుకునేందుకు చెరువు వద్దకు వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు కాలు జారి నీటిలో పడి మృతి చెందాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మోతె మండలం మామిళ్లగూడెంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బీరోలుకు చెందిన బుడ్డిపుడి రాములు – రాణి దంపతుల కుమారుడు వెంకటేష్(26) మోతె మండలం మామిళ్లగూడెంలోని అమ్మమ్మగారి ఇంటికి వచ్చాడు. శుక్రవారం మధ్యాహ్నం బహిర్భూమికి వెళ్తున్నట్లు చెప్పి గ్రామ శివారులోని చెరువు వద్దకు వెళ్లాడు. అక్కడ ప్రమాదవశాత్తు కాలు జారి చెరువు నీటిలో మునిగిపోయాడు. సమీపాన ఉన్న పిల్లలు గ్రామానికి వెళ్లి సమాచారం ఇవ్వగా బంధువులు చేరుకుని వెంకటేశ్‌ను బయటకు తీయగా అప్పటికే మృతి చెందాడు.


