మాంగళ్య షాపింగ్‌ మాల్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

మాంగళ్య షాపింగ్‌ మాల్‌ ప్రారంభం

Mar 14 2026 7:31 AM | Updated on Mar 14 2026 7:31 AM

ఖమ్మంగాంధీచౌక్‌: ఖమ్మం వైరారోడ్డులో ఐటీ టవర్‌ ఎదురుగా ఏర్పాటుచేసిన మాంగళ్య షాపింగ్‌ మాల్‌ శుక్రవారం ప్రారంభమైంది. ఈ మాల్‌ను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వస్త్ర వ్యాపార రంగంలో దశాబ్దాల అనుభవం కలిగి మూడు రాష్ట్రాల్లో శాఖలు కలిగిన మాంగళ్య షాపింగ్‌ మాల్‌ను ఖమ్మంలో ఏర్పాటుచేయడం అభినందనీయమన్నారు. యాజమాన్యం పీఎన్‌.మూర్తి, కాసం నమఃశివాయ బ్రదర్స్‌ కృష్ణార్జునుల మాదిరిగా వ్యాపారం చేస్తూ త్వరలోనే తమిళనాడులో శాఖ ఏర్పాటుచేయనున్నారని పేర్కొన్నారు. అనంతరం సినీ నటి శ్రీలీల జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు.ఖమ్మం ప్రజలు మాంగళ్య షాపింగ్‌ మాల్‌కు ఆదరిస్తారని నమ్మకం ఉందని, తద్వారా మాల్‌ విజయవంతమవుతుందని తెలిపారు. ఆతర్వాత మాంగళ్య షాపింగ్‌ మాల్‌ డైరెక్టర్లు పుల్లూరు నరసింహమూర్తి, కాసం నమఃశివాయ, కాసం మల్లికార్జున, కాసం కేదారినాథ్‌, కాసం శివప్రసాద్‌, పుల్లూరు అరుణ్‌కుమార్‌ మాట్లాడుతూ అన్ని వర్గాల వారికి ప్రతీ సందర్భానికి కావాల్సిన నాణ్యమైన వస్త్రాలను అందుబాటు ధరల్లో అందిస్తుండడమే తమ విజయ రహస్యమని తెలిపారు. ప్రస్తుతం మూడు రాష్ట్రాల్లో 30 బ్రాంచ్‌లు ఉండగా.. ఈ మూడు రాష్ట్రాల్లోనే 9–10 కొత్త ప్రాజెక్టులతో పాటు తమిళనాడులోనూ విస్తరించనున్నట్లు వెల్లడించారు. రూ.99 నుంచి ప్రారంభమై రూ.లక్ష వరకు ధరల శ్రేణిలో వస్త్రాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరక్టర్లు విశాల్‌, వరుణ్‌, కార్తీక్‌, అరుణ్‌, పనీత్‌, సాయికృష్ణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement